ఒక్క ఆలోచన మనిషి జీవితాన్ని నిర్ణయిస్తుందంటారు.. కానీ ఒక్క వైరస్ ప్రపంచాన్నే పరిగెత్తిస్తుందని తెలుసుకోలేక పోయారు.. ఈ పరుగుల జీవితంలో మనిషి సుఖంగా బ్రతకడం కోసమే ఆరాటపడ్డాడు కానీ ఇప్పటి వరకు ప్రకృతి వల్ల, సాటి మనుషుల వల్ల కలిగే కష్టనష్టాలను ఎదుర్కోవడంలో సామర్ధ్యాన్ని సాధించలేదు.. ఇక కరోనా ప్రపంచానికి ముప్పుగా పరిగణిస్తున్న నేపధ్యంలో ఈ మాయదారి మహమ్మారి పీచమణిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ తయారీ కోసం పని చేస్తున్నాయి. ఇందుకు గానూ దాదాపుగా 400 ప్రయోగాలు జరుగుతుండగా వాటిలో పదమూడింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

 

 

ఈ పదమూడింటిలో ఏదో ఒకటి సక్సె అయినా ఈ వైరస్‌ను పాతరవేయవచ్చని ఆశపడుతుంది.. ఇలా దీనికోసం పరిశోధకులు రాత్రి పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్నారు.. ఒకరకంగా అమృతం కోసం దేవతలు, అసురుల మధ్య యుద్ధంలా ఇప్పటి పరిస్దితులు సాగుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో ప్రతి వారికి కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆ కంపెనీల ప్రయాణం ఎక్కడి వరకు సాగింది అనే ఆసక్తి ఉంటుంది.. అయితే ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్త్రా జెనెకా కంపెనీ కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్ అందరి కంటే ముందు రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఒకవేళ అదే జరిగితే మీడియా మొఘల్ రామోజీ వియ్యంకుడి కంపెనీ కీలకం కానుంది. ఎందుకంటే.. ఆ సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది..

 

 

ఇక ఆక్స్ ఫర్డ్ వర్సిటీతోపాటు.. మోడెర్నా ఇన్ కార్పొరేషన్ కూడా పోటీలో ముందు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ ప్రయోగాలు మొదలు కానున్నాయట.. ఇదే కాకుండా అమెరికాకు చెందిన మోడెర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా రెండో దశలో ఉందట. ఇక ఫ్రాన్స్ కు చెందిన అతి పెద్ద ఫార్మా కంపెనీ సినోఫీ. జీఎస్ కేతో కలిసి వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పటికే రెండు ట్రయల్స్ పూర్తి చేశారని, ఈ వ్యాక్సిన్ రావడంలో కాస్త లేటైనా కరోనాకు సమూలంగా చెక్ పెట్టే వ్యాక్సిన్ తమదేనని చెబుతున్నారు. థాయ్ కు చెందిన మరో సంస్థ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. తాము రూపొందించిన వ్యాక్సిన్ కోతులకు ఇవ్వగా.. బోలెడన్ని యాంటీ బాడీస్ ఉత్పత్తి కావటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇకపోతే పై విషయాలన్ని గమనిస్తే, ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలన్ని మధ్యలో ఉన్నాయనే విషయం సృష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే అక్టోబరు, నవంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే వీలుందని అంచనా.. లేకుంటే డిసెంబరు నుండి ఫిబ్రవరిలో పక్కా అని చెప్పక తప్పదు. కానీ అప్పటివరకూ చాలా జాగ్రత్తగా ఉండకుంటే ప్రతి గడప కరోనా వైరస్‌తో నిండిపోతుంది.. ఇప్పటికే పరిస్దితులన్ని విషమించి పోయాయి.. ఎవరికి వారు ఇంట్లో ఉండి ఈ వైరస్‌తో యుద్ధం చేయవలసిన పరిస్దితులు తలెత్తాయి.. కానీ ఈ విషయాన్ని విస్మరించి జనం వారి వారి ఇష్టారీతిగా మసలుకోవడం పట్ల ఆరోగ్య సంస్ద ఆందోళన వ్యక్తం చేస్తుంది.. దీని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ వచ్చేలోపల ఎన్ని దారుణాలు జరుగుతాయో అనే భయం కొందరిలో ఇప్పటికే నెలకొందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: