ట్రంప్...అగ్రరాజ్యం అధినేత. ప్రపంచ పోలీస్ గా ఉన్న అమెరికాకు సర్వాధినేత. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా ఆయనలో ఎపుడూ రెండవ కోణమే బాగా  ఎలివేట్ అవుతూ వచ్చింది. ఆయన ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉండడమే అందుకు కారణం.

 

చాలా విషయాల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడ‌డం ట్రంప్ లక్షణం. ఇక ఆయన పక్కా బిజినెస్ మాన్. దాన్ని కూడా పాలనలో మిక్స్ చేయడంతో జనం ఇబ్బంది పడ్డారు. అమెరికా మొత్తం కరోనాతో అల్లాడిపోతూంటే దేస ఆర్ధిక వ్యవస్థ, వ్యాపారాల గురించి ట్రంప్ ఆలోచన చేశారు.దేశమంతా లాక్ డౌన్ పెట్టలేదు. దాంతో అమెరికా మీద కరోనా  ఒక్క లెక్కన విరుచుకుపడింది.

 

అదిపుడు ట్రంప్ కి పెద్ద దెబ్బగా ఉంది. దానికి తోడు అన్నట్లుగా   నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను అమెరికా పోలీసులు దారుణంగా హత్య చేసిన నేపధ్యంలో ట్రంప్ మీద ఆగ్రహజ్వాలలు జనాల్లో మిన్నంటాయి. ఇక కరోనా అదుపులో ట్రంప్ ఫెయిల్ అయ్యాడని కూడా మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు.

 

ఈ పరిణామాలతో ట్రంప్ ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో వెనకబడి ఉన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి. ట్రంప్ దాన్ని అధిగమించేందుకు కరోనా వేళ ప్రతీ అమెరికా పౌరుడి ఖాతాలో నగదు వేసి ఊరట కలిగించే ప్రయత్నం చేశారు. అంతే కాదు, హెచ్ 1 బీ వీసాలను రద్దు చేయడం ద్వారా అక్కడ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

ఈ నేపధ్యంలో ఎంత చేసినా ట్రంపు కి వ్యతిరేకత వెల్లువలా వస్తోంది. దంతో ట్రంప్ స్వయంగా తన ప్రత్యర్ధి జో బిడెన్ గెలుస్తాడని కూడా జోస్యాలు చెప్పేశారు. ఇక ఆయన జోరు కూడా అలాగే ఉంది. జో బిడెన్ కి మద్దతుగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా కూడా రంగంలోకి దిగడం ట్రంప్ కి పెద్ద దెబ్బ.

 

నవంబర్లో జరిగే అమెరికా ఎన్నికల్లో జో బిడెన్ కనుక గెలిస్తే ట్రంప్ కే కాదు, భారత్ కి కూడా పెద్ద దెబ్బ అంటున్నారు. ట్రంప్ తో భారత్ సంబంధాలు చాలా బాగా ఉన్నాయి. ఓ విధంగా ట్రంప్ గట్టిగానే పాకిస్థాన్ని వ్యతిరేకించారు. చైనాను కూడా కట్టడి చేస్తున్నారు. ఇపుడు చూస్తే కొత్తగా వచ్చే వాడు జో బిడెన్ చైనాకు అనుకూలం అంటున్నారు. పైగా ఆయన పాకిస్థాన్ కి వత్తాసు పాడతాడు అని గత పరిణామాలు నిరూపించాయి.

 

ఇపుడున్న సరిహద్దు సమస్యలు ఉద్రిక్తల నేపధ్యంలో జో బిడెన్ కనుక గెలిస్తే అటు చైనా, ఇటు పాకిస్థాన్ పండుగ చేసుకుంటాయి. ఈ పరిణామాలు భారత్ కి షాక్ తగిలేలా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: