ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇంకెంతో మంది మృత్యువుతో పోరాడేలా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే డిసెంబర్లో చైనా లో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాల్లో అన్నింటి లో విజృంభించింది. ఇప్పటి కే ప్రపంచ వ్యాప్తం గా కోటి కి పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇలాంటి నేపథ్యం లో ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ ఇయాన్ బోథమ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 తనకు ఆరు నెలల ముందే కరోనా  వైరస్ సోకింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇటీవల ఓ బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్య లు చేశాడు. డిసెంబర్ చివర్లో నే తనకి వైరస్ సోకిందని అప్పట్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో బ్యాడ్ ఫ్లూ అని తప్పుగా అర్థం చేసుకున్నా అంటూ ఆయన తెలిపారు. తనకు ఉన్న లక్షణాలు కరోనా వైరస్ లక్షణాలు అని తనకు తెలియద ని సాధారణ జ్వరం వచ్చిన లక్షణా లే అని అనుకున్నాను అంటూ తెలిపారు. దీని గురించి తెలియక చాలా రోజులు బాధ పడ్డాను కానీ తర్వాత తగ్గి పోయింది అంటూ... ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 ఇప్పటికే ప్రజలందరూ కరోనా  వైరస్ నుంచి తప్పించుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలందరూ దీనిని ఇలాగే కొనసాగించి కరోనా  వైరస్ బారి నుంచి బయటపడాలి అంటూ సూచించారు. ఇక మరికొద్ది రోజులు ఓపిక పడితే క్రీడల ప్రారంభమయ్యే అవకాశం ఉందని... భౌతిక దూరం పాటిస్తూ ఆట కొనసాగిస్తే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: