రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళితేనే మనుగడ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ని అడుగడుగునా ఇబ్బందులు పెట్టి, ప్రజల్లో చులకన చేసేందుకు ప్రతిపక్షాలు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటాయి. ప్రతిపక్షాలకు ధీటుగా రాజకీయ వ్యూహాలను రూపొందించి, వారికి అన్ని విధాలా చెక్ పెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ బాగా ఆరి తేలిపోయారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ కి 151 సీట్లు బలం ఉంది. కానీ శాసనమండలి విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ దే పైచేయి. మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రతి బిల్లుని మండలిలో టిడిపి అడ్డుకుంటూ వస్తుంది. ఈ వ్యవహారం మొదటి నుంచి జగన్ కు చికాకు తెప్పిస్తోంది. 


ఈ నేపథ్యంలోనే శాసన మండలి రద్దు రద్దు చేస్తూ జగన్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉంది. వైసిపి తో బిజెపి మైండ్ గేమ్ ఆడుతున్న ఈ పరిస్థితుల్లో శాసన మండలి రద్దు చేస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే టెన్షన్ వైసీపీలో ఉంది. ఒకవేళ రద్దు చేయకపోతే ఏంటి పరిస్థితి అనే విషయంపైన జగన్ ముందుగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగానే రద్దు కాకపోతే మండలిలో బలం పెంచుకునే దిశగా ఇప్పటి నుంచే జగన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.


 తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు శివారెడ్డి, పోతుల సునీత లు వైసిపికి జై కొత్తగా మరో 10 , 12 మంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే శాసన మండలి రద్దు అవ్వకపోయినా, వైసిపి బలం పెరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా జగన్ గెలిపించారు. మిగిలిన సభ్యులు కూడా అదే విధంగా పార్టీలోకి తీసుకుని వారిని గెలిపిస్తే అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారు అనే అపవాదు నుంచి తప్పించుకోవడంతో పాటు శాసనమండలిలో వైసీపీ బలం పెంచుకోవచ్చనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసిపి ఎమ్మెల్సీలను తమ దారికి తెచ్చే పనిలో జగన్ నిమగ్నమైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: