రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉన్న కొద్ది విజృంభిస్తున్నే ఉంది. మొదటిలో చాలావరకు కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేసినట్లు లాక్డౌన్ టైంలో వార్తలు జాతీయస్థాయిలో వచ్చాయి. కానీ లాక్ డౌన్ తర్వాత సీన్ కట్ చేస్తే భయంకరమైన పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఏకంగా పోలీసులకు మరియు రాజకీయ నాయకులకు కూడా కరోనా పాజిటివ్ రావటం తో సామాన్య జనులలో భయాందోళనలు ఎక్కువైపోయాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ జరుగుతుండగా ఏపీలో ఎక్కువ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తరుణంలో ఏపీ లో వైరస్ ప్రభావం కొద్దిగా అదుపులోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలావుండగా కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో కొందరు రాజకీయ నాయకులు అనుసరిస్తున్న వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితంగా ముఖానికి మాస్కు ధరించు కోవాలని రాజకీయ నాయకులు ప్రజలకు తెలియజేయాలని చైతన్య పరచాలని చెబుతుంటే… స్వయంగా ఏపీకి చెందిన  రాజకీయ నేతలు మంత్రులు ఆ సూచనలను పాటించకుండా ఉండటంతో ఏపీ జనాలలో కూడా మాస్కు ధరించాలని సోషల్ మీడియా పాటించాలని అవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరగటం పట్ల విమర్శలు వస్తున్నాయి.

 

అధికార పార్టీ నేతలే కాదు ప్రభుత్వ అధికారులు కూడా ఈ విధంగానే వ్యవహరించడం పట్ల కూడా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నేతలు తమకి కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని కరోనా నిర్ధారణ పరీక్షల ల్యాబ్ లకు శాంపిల్స్ వేరే వారి పేరిట పంపించి టెస్టులు చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నెగటివ్ వస్తే కామ్ గా ఉంటున్నట్లు , పాజిటివ్ వస్తే గుట్టుచప్పుడు కాకుండా హోమ్ క్వారంటైన్ పాటిస్తున్నట్లు ఏపీలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగానే ఇటీవల ఏపీలో ఓ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తమ వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాంపిల్స్ పంపించి వాళ్ల పేర్ల మీద కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: