భారత్ తో పెట్టుకుంటే వేల కోట్లు ఏంటి లక్షల కోట్లు కూడా నష్టపోవాల్సి ఉంటుంది మరి. నిన్న సాయింత్ర 59 మొబైల్ యాప్స్ ను నిషేధం విధించిన సంగతి తెలిసింది. దీంతో చైనా విలవిల్లాడుతుంది. కేవలం అంటే కేవలం ఒక్క టిక్ టాక్ పై నిషేధం విధించడం వల్ల దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌ నెలకు అక్షరాలా వంద కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుంది అని సమాచారం. 

 

IHG

 

నిజానికి ప్రపంచం మొత్తంలో టిక్‌టాక్ వాడకంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. కేవలం భారత్ నుండే ఏకంగా 40 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయంటే మీరే అర్ధం చేసుకోండి. ఇంకా భారత్ నిషేధించడం వల్ల కేవలం టిక్ టాక్ కే రోజుకు మూడున్నర కోట్ల నష్టం వస్తుందని బైట్ డ్యాన్స్ ప్రతినిధి చెప్పారు. 

 

IHG's what I learned | World Economic Forum

 

భారత్ లో ఎక్కువ డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ లో చైనా అప్లికేషన్స్ ఏ ఎక్కువట. వినోదం పంచే యాప్స్ మాత్రమే కాకుండా ఇంకా మిగితా యాప్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉపయోగిస్తున్నారట. ఇంకా నిజం ఏంటి అంటే? ప్రస్తుతం భారతీయులకు ఏది చైనా యాప్ ఓ.. ఏది భారత్ యాప్ ఓ కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

 

IHG

 

2020 మార్చి నుంచి మే మధ్య భారత్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన 10 మొబైల్ యాప్‌లల్లో ఐదు చైనా కంపెనీలవే ఉన్నాయట. ఇంకా అందులో టిక్‌టాక్, జూమ్, హలో, యూవీడియో, యూసీ బ్రౌజర్ ఉన్నాయి. ఇది అండి ప్రస్తుతం సంగతి. ఏది ఏమైనా చైనా అప్లికేషన్స్ బ్యాన్ చెయ్యడం సరైన పని. 

మరింత సమాచారం తెలుసుకోండి: