చైనా భారత్ వివాదం గురించి ఇరుదేశాల ప్రజల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఇరు దేశాలు భారీగా సైనికులను మోహరించడంతో ఇప్పట్లో ఈ వివాదం పరిష్కారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్ లపై భారత్ నిషేధం విధించింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి చైనా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. 
 
ఇకపై చైనా ఉత్పత్తులను బహిష్కరించే దిశగా భారత్ అడుగులు వేయనుందని సమాచారం. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న తరువాత క్రయవిక్రయాలు తగ్గుతున్నాయి. గతంలో పాక్ తో భారత్ కు మంచి వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉండేవి. అయితే పాక్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది తామేనని అధికారికంగా ప్రకటించడంతో అప్పటినుంచి పాక్ తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 
 
ప్రస్తుతం చైనాతో కూడా వ్యాపార, వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. వ్యాపార... వాణిజ్య నిపుణులు.... రక్షణ నిపుణులు, విదేశాంగ నిపుణులు పదేళ్ల పాటు కష్టపడితే చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ హయాంలో భారత్ లో చైనా ఉత్పతుల కొనుగోళ్లు పెరిగాయి. చైనా మొదట్లో తక్కువ రేటుకు ఇచ్చి మన దేశంలో ఆ వస్తువుల కంపెనీలు మూతపడ్డాక ఎక్కువ రేటుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 
 
భారత్ చైనాపై ఎలక్ట్రానిక్ గూడ్స్ లో 45 శాతం, క్యాపిటల్ గూడ్స్ లో 32 శాతం, ఆర్గానిక్ కెమికల్స్ లో 38 శాతం, ఫర్నిఛర్ కొనుగోళ్లలో 57 శాతం, ఫర్టిలైజర్స్ లో 28 శాతం, ఆటోమోటివ్ పార్ట్స్ విషయంలో 25 శాతం, ఫార్మా రా మెటీరియల్ విషయంలో 68 శాతం ఉత్పత్తుల విషయంలో ఆధారపడుతోంది. ఇప్పటికే కేంద్రం చైనాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను రద్దు చేస్తూ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: