గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి క‌రోనా.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఈ క్ర‌మంలోనే కొన్ని ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ క‌రోనా వైర‌స్ మున‌గ‌డకు అడ్డుక‌ట్ట వేయాల‌ని ప్ర‌పంచ‌దేశాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు. దీంతో మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది క‌రోనా. అయితే వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చారు. దీంతో యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

 

కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. గ‌త కొన్ని నెల‌లుగా రాత్రి, పగలు అపి తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప్రాణాంత‌క క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంది..? అన్న‌దానికి స‌రైన స్ప‌ష్ట‌త లేదు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం క‌రోనా ఉందో.. లేదో.. తెలుసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేస్తుందో. దీంతో క‌రోనా కేసులు మ‌రింత ఎక్కువ అవుతున్నాయి. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో గాంధీనగర్ ఐఐటీ విద్యార్థులు ఓ వినూత్న కంప్యూటర్ ప్రోగ్రామ్ ను రూపించాడు. ఈ ప‌రిక‌రం ద్వారా ఛాతీ ఎక్స్ రేను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డీప్ లెర్నింగ్ టూల్ కు అనుసంధానం చేసి, శరీరంలో కరోనా వైరస్ ఉందో.. లేదో.. పసిగట్టవచ్చు. ఎక్స్ రే చిత్రాలను పరిశీలిస్తే, కరోనా జాడను కనుగొనవచ్చని, మెదడులో 12 పొరల్లో ఉండే నాడీ వ్యవస్థ ఆధారంగా ఇది పని చేస్తుందని రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించిన ఎంటెక్ విద్యార్థి కుష్ పాల్ సింగ్ యాదవ్ వెల్ల‌డించారు. అయితే ఈ విధానంపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇప్పించి, దీనిని అందరికీ అందుబాటులోకి తేవచ్చని ఆయ‌న పేర్కొన్నారు. ఒక‌వేళ అదే గ‌నుక జ‌రిగితే క‌రోనా ఉందో.. లేదో.. తెలుసుకోవ‌డం మ‌రింత సులువు అవుతుంది. దీంతో క‌రోనా కేసులను కూడా అరిక‌ట్ట‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: