బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనుండ‌టంతో ఉత్త‌ర తెలంగాణ జిల్లాల రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ లో నీటి నిలువ 0.62 టీఎంసీల నీటి నిలువ ఉన్న ట్లు   తెలిసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 2.7 టీఎంసీలు ఎగువ ప్రాంతంలోని గైక్వాడ్ ప్రాజెక్ట్ పూర్తి గా నిండిన తర్వాత బాబ్లీ ప్రాజెక్ట్ లోకి గోదావరి జలాలను మ హారాష్ట్ర ప్రభుత్వం వదులుతుంది. ఇదిలా ఉండ‌గా మహారాష్ట్రలో వర్షాలు పెద్ద గా లేక‌పోవ‌డంతో  ప్రాజెక్ట్ లోకి నీరు వచ్చే అవకాశం ఇప్పట్లో లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.  దీంతో కాళేశ్వరం నీటి పై నే ఎస్సారెస్పీ ఆధారపడి ఉంది. బుదవారం  బాబ్లీకి ఎస్సారెస్పీఇంజనీర్ల తోపాటు హైదరాబాద్ నుంచి కేంద్ర జల సంఘం సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. 

 


నాందేడ్‌ జిల్లాలోని బాబ్లీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో బాబ్లీ ప్రాజెక్టు పూర్తి చేసింది. నిర్మాణ సమయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేంద్రం జలసంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు ఒప్పందం కుదిరింది. ప్రతి ఏటా జులై 1న గేట్లు తెరిచి అక్టోబరు 28న మూసివేయాలని ఆదేశించింది. మళ్లీ మార్చి 1న ఒకరోజు అర టీఎంసీ నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి ఒకటిన ఒకరోజు గేట్లు తెరవాల్సి ఉంటుంది. తాగునీటి అవసరాల కోసం బాబ్లీ నీటిని దిగువకు వదలాలి. అందులో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో బుధ‌వారం గేట్లు తెరుచుకోనున్నాయి.

 

గోదావరి నధిపూ ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్ట్లలను 78 వరకు నిర్మించింది. దీంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉన్న ఎస్సారెస్పీ ప్రశ్నార్థకంగా మారడంతో ఉమ్మడి రాష్ర్టంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  సూప్రీం కోర్టు తీర్పు ఉత్తర్వులను అనుసరించి ప్రతి ఎడాది జూలై 1 నుంచి ఆక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను ఎత్తివేస్తారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు వచ్చిన నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతుంది. గత ఏడాది వర్షాలు లేక పోవడంతో ఎస్సారెస్సీ డేడ్ స్టోరేజ్ లో ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్సీలో 29.722 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: