దేశంలో కరోనా వైరస్ ఉదృతంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకీ రికార్డుస్థాయిలో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు దృష్ట్యా మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడం వింటూనే ఉన్నాం. ఇదే టైములో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా మరోసారి లాక్ డౌన్ అనే టైపు లో కామెంట్లు చేయడం జరిగింది. మరో పక్క మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఇటీవల లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. కాగా మళ్ళీ లాక్ డౌన్ అంటూ వస్తున్న వార్తల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అసలు లాక్ డౌన్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు నాగబాబు.

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి ఈ గ్యాప్ లోనే మెడికల్ రిసోర్సెస్ కనిపెట్టి వాటి ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సరైన చికిత్స అందించడమే లాక్ డౌన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే దేశంలో మొదటిలో విధించిన లాక్ డౌన్ మూడు నెలల కాలం పాటు దేశంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మరలా ఇప్పుడు లాక్ డౌన్ అని అంటే అది చారిత్రక తప్పిదం అవుతుందని స్పష్టం చేశారు.

 

ప్రపంచంలో ఎన్నో దేశాలు మళ్లీ లాక్ డౌన్ అమలు చేయకుండానే చాలావరకు వైరస్పై విజయం సాధించడం జరిగిందని తెలిపారు. కాగా మన దేశ జనాభా ఎక్కువ అయిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందటం సాధారణం అయినప్పటికీ దాని పై పోరాటం చేయాలి కానీ మరల లాక్ డౌన్ అనే నిర్ణయం తప్పు అని అన్నారు. అంతేగాని ప్రజలు ఇళ్ల నుండి రాకూడదు హాస్పిటల్స్ ఖాళీ లేవు అని లాక్ డౌన్ మళ్ళీ విధించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించటం నాకు నచ్చలేదు అని నాగబాబు చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: