జాతీయ మీడియా ఎపుడూ జగన్ తప్పులను బూతద్ధంలో వెతకడమే పనిగా పెట్టుకుంది. ఏపీలో చీమ చిటుక్కుమన్నా కూడా పెద్దది చేసి చూపించేది. చంద్రబాబు చలో అత్మకూరు అంటే నేషనల్ మీడియా ఓ రేంజిలో ఏపీకి వచ్చి బాబు ఇంటి ముందు గేటు వద్ద నుంచే లైవ్ ప్రసారం చేసిన సంగతి గుర్తుందిగా. ఇక జగన్ కి పాలన తెలియదు, బాబు అభివ్రుధ్ధి కారకుడు అయితే జగన్ విద్వంసకారుడు అంటూ ప్రజావేదిక కూల్చివేతను చాలా పెద్దది చేసి చూపించింది.

 

సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ ఏడాది పాలనలో కోర్టుల నుంచి మొట్టికాయలు పడుతూంటే దాన్ని కూడా గట్టిగా రాసి అభాసు చేసింది. ఏపీ ఒక్క ఏడాదితో సర్వనాశనం అయిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు పనిగట్టుకుని రాసిన రాతలు ఉన్నాయి. ఇపుడు అటువంటి జాతీయ మీడియా  ప్రతినిధులకు ఏపీలో జగన్ కరోనాతో చేస్తున్న పోరాటం బాగా కనిపిస్తోందిట.

 

దాంతో ఇన్నాళ్ళూ తాము అన్న దాన్ని సవరించుకుని మరీ  కరోనా వేళ జగన్ ఏపీలో చేస్తున్న కార్యక్రమాలు, కరోనా కట్టడికి ఆయన తీసుకుంటున్న చర్యలు హాట్సాఫ్ అంటున్నాయి.  ఏపీలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించడమే కాదు, రానున్న రోజుల్లో ఇంటింటికీ పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించడాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు.

 

ఇక విద్యా, వైద్య రంగానికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇపుడు నేషనల్ మీడియాలో నానుతోంది. నాడూ నేడూ అంటూ జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను కూడా ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా మెచ్చుకుంటే దాన్ని తప్పనిసరిగా రాయాల్సివస్తోంది. అదే ఆప్ నేత కేజ్రీవాల్ గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రచారానికి ఏపీకి వచ్చారు.

 

ఇక జగన్ కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా పేదలను ఆదుకున్నారు. ప్రజల చేతుల్లో రూపాయి ఆడేలా చేశారు. దీన్ని దేశమంతా అమలు చేయాలని కూడా ఇపుడు జాతీయ మీడియాలో అంతా కోరుతున్నారు.  ఇక కరోనా మీద మరో పోరాటానికి జగన్ రెడీ అయ్యారు. పెద్ద ఎత్తున 104, 108 వాహనాలు కొనుగోలు చేసి ప్రజల ముంగిటకు అత్యాధునిక‌ వైద్యాన్ని తీసుకెళ్తున్నారు. 

 

దీంతో కరోనా కట్టడికి కొత్త ఆయుధాన్ని ఇస్తున్నారు. అలాగే పీ హెచ్ సీలను ఇరవై నాలుగు గంటలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా డాక్టర్లను కరోనా వేళ తీసుకుని వైద్య రంగాన్ని అభివ్రుధ్ధి చేస్తున్నారు. ఇవన్నీ చూసినపుడు జగన్ కరోనా కట్టడి చేస్తూ దేశంలో అగ్రభాగాన నిలిచారని చెప్పకతప్పదు. ఇపుడు నేషనల్ మీడియా కూడా ఏపీ వైపు చూస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: