కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు ఆ యాప్స్ అన్నీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలేట్ అయ్యాయి. ఈరోజు సాయంత్రం నుంచి పలు యాప్స్ పని చేయడం లేదని సమాచారం అందుతోంది. మరి కేంద్రం అకస్మాత్తుగా ఈ యాప్ లను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటి.....? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. 

 

ప్రస్తుత కేంద్రం యాప్ లను నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం చైనా యాప్ లను నిషేధించడం వెనుక మూడు నిజాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం లడఖ్ వివాదం గురించి ప్రధాని మోదీ చేసిన ప్రకటనను వీచాట్ తొలగించింది. చైనాకు సంబంధించిన యాప్ కాబట్టి మోదీ వ్యాఖ్యల విషయంలో వీచాట్ ఈ విధంగా వ్యవహరించింది. మన దేశపు భావప్రకటన స్వేచ్ఛను చైనా యాప్ లు హరిస్తున్నాయి. 

 

రెండో నిజం ఏమిటంటే జూన్ 15వ తేదీన ఇరుదేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి. చైనా కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల భారత్ కు చెందిన 20 మంది జవాన్లు చనిపోయారు. అదే సమయంలో చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియాలో చైనాకు చెందిన టిక్ టాక్ ను ఆపగలిగే దమ్ము భారత్ కు ఉందా....? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. చైనా యాప్ లను నిషేధించడానికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది. 

 

చైనాకు చెందిన యాప్ ల ద్వారా ఆ దేశానికి 76,000 కోట్ల రూపాయల నుంచి 1,15,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వెళుతోంది. దీంతో చైనా యాప్స్ పై బ్యాన్ విధించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ యాప్స్ మరలా భారత్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: