చంద్రబాబుకు ఎపుడూ ఓడిన తరువాతనే కొత్త ఆలోచనలు వస్తాయి. పాత తప్పులు కూడా గుర్తుకువస్తాయి. ఇపుడూ అంతే. ఆయన ఓడిన వెంటనే అన్న మాట బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామని, ఆ తరువాత మహానాడులో కూడా పార్టీ నాయకులు ఇదే మాట అన్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే రాసింది. ఏదేమైతేనేం. బాబు మళ్ళీ మోడీతో జట్టు కట్టాలని  గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ అది అంత సులువుగా జరిగే పని కావడంలేదే.

 

అదే ఇపుడు బాబుని కలవరపెడుతోంది. తాను బీజేపీతోనే ఇక ఉంటానని కూడా బాబు ఒట్టు కూడా వేస్తున్న కమలనాధులు పట్టించుకోవడంలేదు. ఇక బాబు ఈ మధ్య మోడీని తెగ పొగుడుతున్నారు. ఎంతలా అంటే మోడీ ఏం చేసినా భేష్ అంటున్నారు. నిజానికి మోడీ కరోనా వైరస్ విషయంలో చేతులెత్తేశారు. దేశంలోని పేదలకు ఊరటను ఇచ్చే పధకం కూడా ఏదీ తీసుకురాలేదు.

 

తొంబయి  రోజుల పాటు లాక్ డౌన్  పేదవాడిని ఇంట్లో పెట్టి వారిని ఇపుడు లక్షల కరోనా కేసులు వచ్చిన తరువాత ఎదురెళ్ళమంటున్నారు. ఈ నేపధ్యంలో కూడా బాబు మోడీని పల్లెత్తు మాట అనడంలేదు. దేశంలోని ఇతర పక్షాలు మోడీని నిందిస్తున్న బాబు మాత్రం శభాష్ అంటున్నారు. ఇక మోడీ సర్కార్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసినా కూడా బాబు ఇదేమని అడగడంలేదు. సరికదా తప్పంతా జగన్ దే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

 

ఇవన్నీ మోడీ కోసమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా బాబు ఈ మధ్య ఆరెసెస్ వారితో కూడా భేటీ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిని కలసి తనకు బీజేపీకి మళ్ళీ  బంధం కలపని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ఆరెసెస్ నేతలు తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చేసినట్లుగా సమాధానం. ఆ  మీదట బీజేపీ నేతలనే అడగమని సలహా ఇచ్చారట.

 

ఇక కేంద్ర బీజేపీ నేతలు రాష్ట్ర బీజేపీ నేతల మీద నెడుతున్నారుట. ఏపీ బీజేపీలో బాబు వ్యతిరేక వర్గం నాయకులు ఆయన వద్దు అంటున్నారుట. ఏపీలో టీడీపీని మళ్ళీ ఎక్కించుకుంటే బీజేపీకే ప్రమాదం అంటున్నారుట. మరి చూడాలి బాబుకు మోడీకి దోస్తీ ఎలా కుదురుతుంతో, బాబు ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: