ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదమే  హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే, చైనా ఎత్తులు వేయడం దానికి ధీటుగా భారత్ పై ఎత్తులు వేయడం జరుగుతూ ఉంటుంది. చైనా ఎంత బెదిరింపులకు పాల్పడినప్పటికి  భారత్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా ధీటుగానే బదులిస్తోంది. ప్రతి విషయంలో కూడా భారత్ చైనా కు దీటుగా బదులిస్తోంది. అయితే భయపడితే ఊరుకునే వాడు ఎప్పటికీ ఎదగలేడు తెగించి ముందుకు వెళ్ళిన వాడు రాజు అవుతాడు అని ఉన్న నానుడికి ప్రస్తుతం భారత్  తీరు సరిగా సరిపోతుంది, 

 


 అయితే ఇటీవల చైనా వంతెన కు సంబంధించి ఒక విషయం బయటకు వచ్చి సంచలనంగా  మారిపోయింది. భారత తెగింపు కు నిదర్శనంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు. భారత సైన్యం చైనా వంతెన కూల్చింది అన్నది ఎవరూ నమ్మలేదు.. గాల్వాన్ లోయలో  పాంగ్వాన్  నదికి అడ్డంగా ఓ రిజర్వాయర్ కట్టి,. భారత్ కి భారీ షాక్ ఇవ్వాలని చైనా  ప్రయత్నం చేసింది, అయితే కేవలం రిజర్వాయరు నిర్మించడమే కాదు దాని కింద  ఒక రోడ్డును కూడా నిర్మించింది ప్రస్తుతం చైనా. నది వద్ద ఉన్న మైదానం తరహా భాగంలో ఒక రోడ్డు వేసుకుని అటునుంచి సైన్యాన్ని తరలించడానికి వ్యూహం పన్నింది. 

 


 అయితే ఇటీవలే అక్కడి వంతెనను   భారత్ కూల్చింది  అని అంటున్నారు విశ్లేషకులు. సదరు చైనా వంతెనను  భారత సైన్యం కూల్చినటువంటిది నిజం అని అంటున్నారు. అయితే ఈ సందర్భంలో రిజర్వాయర్ నుంచి ఒక వాటర్ ఫ్లో మొదలవగా నీటి దాటికి చైనా వేసుకున్న రోడ్డు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయింది, అయితే సైన్యం అతిత్వరగా మళ్లీ ఆ వంతెనను నిర్మించుకున్నప్పటికీ.. భారత్ దెబ్బకు మాత్రం చైనా బెదిరి పోయింది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం చైనా భారత్ ని బయపెట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ భారత్ మాత్రం తెగించి ముందుకు వెళ్లే చైనాకే షాకుల మీద షాకులు ఇస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: