కేరళలో గత 11రోజుల నుండి ప్రతి రోజు 100కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 131పాజిటివ్ కేసులు నమోదయయ్యాని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అందులో 65 కేసులు విదేశాల నుండి వచ్చిన వారివి కాగా 46 ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారివి, మిగితావి కాంటాక్ట్ కేసులు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 4442కేసులు నమోదుకాగా అందులో 2112కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2306మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా ఈరోజు కరోనాతో ఒకరు మృతి చెందారు దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 24కు చేరింది. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో 3943కేసులు బయటపడగా కర్ణాటక లో ఈరోజు 947కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 704 కేసులునమోదు కాగా తెలంగాణలో 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 578000దాటగా 17000కు పైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: