ఏపీ సీఎం జగన్ నేడు ఓ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు. విజయవాడలో వందలాదిగా 104,108 వాహనాలను ప్రారంభించబోతున్నాడు. 108.. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డే.. ఆయన కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ ఈ ప్రాణసంజీవనులు మీ వద్దకు వస్తాయంటూ ప్రతి సభలో చెప్పేవాడు. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన వైఎస్‌కు జననేతగా మలచింది ఇలాంటి పథకాలే.

 

 

మొన్నటి ఎన్నికల్లో జనం జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారంటే.. అందుకు కారణం.. రాజశేఖర్ రెడ్డి వారసుడనే.. ఇచ్చినమాట నిలబెట్టుకుంటాడనే. అందుకే జగన్ సైతం తన తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రజలందరికి ఆరోగ్యం చేరువ అయ్యేలా.. మారుమూల ప్రాంతాలకు కూడా 108,104 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

 

IHG

 

ఈ కొత్త వాహనాల రాకతో ప్రతి మండలంలో ఒక అధునాతన అంబులెన్స్ ఉండబోతోంది. అంటే ఒక విధంగా ఏపీ ప్రజారోగ్య రంగంలో ఒక సువర్ణాధ్యాయమే. గతంలో వైఎస్ రాజశేఖరరడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్య వాహనాల ద్వారా వేల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఆ తర్వాత కాలంలో వీటికి గ్రహణం పట్టినట్టైంది. చంద్రబాబు ప్రభుత్వంలో వాటిని పూర్తిగా నిర్లక్షం చేశారు. మళ్లీ జగన్ వచ్చాకే వాటికి పునర్‌వైభవం వస్తోంది.

 

 

ఎంతో మానవత్వం, దయార్ద్ర హృదయం ఉంటే తప్ప ఇలాంటి స్కీము తీసుకు రాలేరు. జగన్ నుంచి జనం ఇలాంటి పథకాలే కోరుకుంటున్నారు. తమ కష్టాలు తీర్చే నాయకుడని నమ్మిన పేద, బలహీన వర్గాల ప్రజలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాల గురించి జగన్ ఆలోచించాలి. జన సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: