రాజకీయంగా పెను సవాళ్ళను నిత్యం ఎదుర్కొంటూ, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒక పక్క పార్టీ నాయకులంతా జైలుకు వెళుతుండటం, అధికార పార్టీ వేధింపులు, ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటి నుంచి బయటపడి, పార్టీ నేతలను గట్టెక్కించాలంటే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఏకైక మార్గంగా చంద్రబాబు గ్రహించారు. ఎప్పటి నుంచో బిజెపి నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వడం లేదు. పదే పదే ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ, బిజెపి ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామనే సంకేతాలను పంపిస్తున్నా, కేంద్ర బిజెపి పెద్దలెవరూ, అంతగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, వంటి కారణాలు బాబు కి ఆవేదన కలిగిస్తున్నాయి. 

 


తాను బీజేపీకి దగ్గరవ్వాలని ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, వారు పట్టించుకోవడం లేదు అనే బాధ చంద్రబాబును ఎక్కువగా కలిచివేస్తోంది. అసలు బిజెపితో జనసేన పొత్తు పెట్టుకునేలా చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందనేది రాజకీయవర్గాల్లో ఉన్న అనుమానం. పవన్ ద్వారా బిజెపికి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుల ద్వారా కూడా ఆ పార్టీ అగ్రనేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదట. తాజాగా బీజేపీతో పొత్తు విషయమై ఆర్ఎస్ఎస్ నాయకులతో చంద్రబాబు మంతనాలు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

 

IHG

 

ఏదో ఒక రకంగా బిజెపి  అండదండలు టిడిపికి ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు రాజకీయం నడిపిస్తున్నా, టిడిపి విషయంలో గతంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందుల దృష్ట్యా, టిడిపి ని దూరం పెడుతున్నట్టుగానే బిజెపి అగ్రనేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఏపీ ఎన్నికల అధికారి గా పనిచేసి, వైసీపీ నాయకులతో  అనేక ఆరోపణలు చేయించుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి ఏపీ మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావు భేటీ అవ్వడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనే విషయం బిజెపి నాయకులకు తెలియడంతో చంద్రబాబును మరింత దూరం పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే బిజెపి నాయకుల ద్వారా చంద్రబాబు ఈ విధంగా రాజకీయాలు చేయడం పైన బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: