భారత్, చైనాల మధ్య వివాదం ఏర్పడడంతో, రెండు దేశాలు అన్ని విషయాల్లోనూ తగతెంపులు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న రేంజ్ లో పరిస్థితులు తయారయ్యాయి. భారత్ ను దెబ్బకొట్టేందుకు చైనా వ్యూహం పన్నుతూ ఉండగా, చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టి భారత్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే, సోమవారం రాత్రి చైనాకు చెందిన 59 మొబైల్ యాప్ లను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ఊహించని విధంగా భారత్ నిర్ణయం వెలువడటంతో దానికి కౌంటర్ గా చైనా కూడా భారతదేశానికి చెందిన వెబ్సైట్లను బ్యాన్ చేసింది.

 

IHG


 ముఖ్యంగా మీడియా సంస్థల వెబ్ సైట్ లు మొత్తం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ చర్యకు ప్రతిచర్య గానే, తాము ఇండియన్ వెబ్సైట్లను బ్యాన్ చేశామని చైనా ప్రకటించుకుంది. ఇండియా, చైనా యాప్ లను  నిషేధించాలని నిర్ణయం తీసుకోక ముందు చైనా, మనదేశ వెబ్సైట్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఏ దేశంలో అయినా బ్లాక్ చేయబడిన సైట్లు, యాప్ లను మళ్ళీ యాక్టివ్ చేసేందుకు వీపీఎన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ చైనా మాత్రం ఆ సర్వీసులను కూడా పని చేయకుండా చేయగలిగింది. వీపీఎన్ సర్వీసులను కూడా నిలిపివేసే అత్యంత ఆధునిక టెక్నాలజీని చైనా డెవలప్ చేసుకున్నట్లుగా సమాచారం.


 కాకపోతే ప్రస్తుతానికి భారత్ కు చెందిన వెబ్ సైట్ లను మాత్రమే చైనా బ్యాన్ చేసింది. కానీ టీవీ చానళ్ళు ఐపిటివి ద్వారా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇండియాలో ఎంతో ప్రజాదరణ పొంది, అగ్రస్థాయి రేటింగ్ లో ఉన్న టిక్ టాక్ భారత్ నిషేధించడంతో మళ్లీ తమపై నిషేధం తొలగించాల్సిందిగా టిక్ టాక్ యాజమాన్యం కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేంద్రం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: