2019 ఎన్నికలలో దాదాపు చావుదెబ్బ రిజల్ట్ వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలకీ జగన్ వ్యూహాలు అసలు అర్థం కావడం లేదని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఊహించని విధంగా ఎవరు తలవంచని విధంగా గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి కార్యక్రమాన్ని బయటపెడుతూ జగన్ స్ట్రాటజీ లకు టీడీపీలో బలమైన పొలిటికల్ కెరియర్ కలిగిన నేతల రాజకీయ జీవితాలు డేంజర్ జోన్ లోకి వెళ్లి పోతున్నట్లు తాజా పరిణామాల గురించి వార్తలు బలంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా చంద్రన్న కానుకలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ పై వంటి వాటిపై సీబీఐ విచారణ ఎవరూ ఊహించని విధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలకు దారితీశాయి.

 

ఇదే టైములో అచ్చెన్నాయుడు అరెస్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ఇలా వరుస పెట్టి టీడీపీకి ఊపిరాడకుండా చేస్తున్న జగన్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో కీలకంగా చంద్రబాబు హయాంలో పనిచేసిన ఓ మంత్రిని అరెస్టు చేయబోతున్నట్లు దేశవ్యాప్తంగా ఈ న్యూస్ హైలెట్ అవుతున్నట్లు వైసీపీ పార్టీ లో టాక్ నడుస్తుంది. టీడీపీ కి భవిష్యత్తు అనే నాయకుడు అని టాక్ నడుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో జగన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేదాని గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా వ్యవహరించిన వారికి ఎప్పుడు ప్రభుత్వం నుండి నోటీసులు అందుతాయో అన్న దాని విషయం లో తెగ టెన్షన్ పడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా చూస్తే ఈ ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీలో చాలామంది చంద్రబాబు హయాంలో పనిచేసిన మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని ఏపీ రాజకీయాలలో  వార్తలు బలంగా వినబడుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై మంత్రుల చేత సబ్ కమిటీ వేసి నివేదిక తప్పించుకున్న జగన్… సరైన లిస్టు వేసి సరైన టైంలో పొలిటికల్ కెరీర్ లేకుండా  కేసులలో ఇరుక్కుపోయే విధంగా స్ట్రాటజీ లు వేస్తున్నట్లు వైసీపీ పార్టీలో టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: