కరోనా మహమ్మారి కి సంబంధించి ఏ చిన్న వార్త తెలిసినా, ప్రజలకు అది ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్ ప్రభావానికి గురయ్యారు. ప్రపంచమంతా అల్లాడుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు. ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ కు మందు రాకపోవడంతో, జనాల్లోనూ ఆందోళన తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా  పెరుగుతుండడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. మొన్నటి వరకు భారత్ వంటి దేశాల్లో ఈ కరోనా కాస్త అదుపులో ఉన్నట్టు గా కనిపించినా, ఇప్పుడు బాగా శృతి మించింది. ఇది ఎలా ఉంటే కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది.

 


 ఎప్పటికప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ వో పర్యవేక్షిస్తూ వస్తోంది. అలాగే ఈ మహమ్మారి నివారణకు మందు కనిపెట్టే అంశాలపైన డబ్ల్యూహెచ్ఓ దృష్టి పెట్టింది. త్వరలోనే ఈ వైరస్ కు మందు కనిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటూ, ముందుకు వెళుతుంది. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసేది కాదని, దీని ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రకటించారు.

IHG


 ప్రస్తుతం ఈ కరోనా వైరస్ తీవ్రతరం అవ్వడానికి వాతావరణం అనుకూలంగా ఉండటమే కారణమవుతోందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా జూలై నెలలో కరోనా మరింత పెరుగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటన చేశారు .తాజాగా డబ్ల్యూహెచ్ఓ కూడా ఇదేవిధంగా ప్రకటించడంతో ఈ కరోనా భయం మరింతగా జనాల్లో పెరిగిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: