కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలో భయంకరంగా వ్యాప్తి చెంది ఉంది. రోజు రోజుకి నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య బట్టి తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ లో  పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కంట్రోల్ చేయడం కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు అని అందరికి తెలుసు. కానీ ఇప్పటి వరకు సరైన సత్ఫలితాలు ఏ దేశం నుండి కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో సక్సెస్ వచ్చినట్టు వార్తలు రాలేదు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు కోటి దాటిపోయాయి.

 

ఇటువంటి తరుణంలో ఈ వైరస్ కి సంబంధించి హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఓ పరిశోధనలో తేలినట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో అద్భుతమైన ఫలితాలు పొందినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో సక్సెస్ సాధించినట్లు ఈ వ్యాక్సిన్ పై కేంద్ర ఔషధాల శాఖ కూడా దాదాపు ఓకే చేసినట్లు మంచి సత్ఫలితాల పరిశోధన విధానాన్ని బట్టి కచ్చితంగా ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా జూలై మాసం నుండి మనుషులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చేసేందుకు భారత్ బయోటెక్ కంపెనీ కి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. జరిగే ఈ ట్రయల్స్ లో చైనా రిజల్ట్ చూపితే ప్రపంచంలో ఇండియా కి తిరుగు లేదని చెప్పవచ్చు. ఈ వ్యాక్సిన్ కనుక మనుషుల పై జరిగే ప్రయోగం లో సక్సెస్ సాధిస్తే ఈ ఏడాది చివరిలో మార్కెట్లో వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: