మనిషి తాను సౌకర్యవంతంగా జీవించడానికి అణువుగా పరిస్దితులను మార్చుకుంటున్నాడు.. ఇందులో భాగంగా ఆధునికమైన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాడు.. దీన్ని మంచికోసం ఉపయోగించవలసింది పోయి ఇతరులను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాడు.. అంటే తన పతనానికి తానే గోతులు తవ్వుకుంటున్నాడు.. ఇక ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.. దీని వల్ల సామాన్యుల నుండి, సంపన్నులకు తలనొప్పులు వస్తున్నాయి.. ఈ నేరగాళ్లూ చేసే మోసాల్లో ఎక్కువగా టెక్నాలజీని వాడటం వల్ల మోసపోయిన వారు వీరి మోసాన్ని గుర్తించే లోపలే జరగవలసిన నష్టాలు జరుగుతున్నాయి.. ఇలాంటి మోసాలు ఎన్ని అరికట్టినా, రోజుకో కొత్త మార్గంలో ఈ నేరగాళ్లూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు..

 

 

ఇక ఈ మార్గంలో సులువుగా డబ్బులు వస్తుండటంతో కొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదుటి వారిని నిలువునా ముంచేస్తున్నారు.. ఈ క్రమంలోనే వ్యాపారులకు కుచ్చుటోపి పెట్టేవిధంగా సరికొత్త విధానంతో మోసాలు చేస్తున్నారు.. ఇక ఇలాంటి మోసం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.. ఆ వివరాలు చూస్తే.. చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు యువకులు  విలాసాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు. వీరంతా కలిసి మదనపల్లెలోని ఆరుగురు వ్యాపారుల నుంచి సెల్ ఫోన్ లు, బట్టలు, బేకరీ నుంచి ఫుట్ ఐటెమ్స్ కొనుగోలు చేసి. తర్వాత ఆ వ్యాపారుల సెల్‌ ఫోన్లకు ఫోన్‌పేలో డబ్బు వేసినట్లు డింగ్‌టోన్‌ యాప్‌ ద్వారా నకిలీ మెసేజ్‌లను పంపించారు.

 

 

ఇలా వారు మెసేజ్ పంపించినప్పుడు డబ్బులు వచ్చినట్లు తెలిసేది. తిరిగి ఖాతాలో చూసుకుంటే నగదు జమ కాకపోయేది. ఇలా వీరు చేసే మోసాన్ని కనిపెట్టిన బాధితులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేసి 9మందిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ నిందితులు ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండేవారిని బోల్తా కొట్టించేందుకు అమ్మాయిల పేరిట నకిలీ ఖాతాలు తెరచి డబ్బు దోచుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: