ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా జరిగే కొన్ని కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. అందులో కొన్నీంటి నిజాలు బయటకు వస్తే, మరికొన్ని విషయాలకు సంబంధించిన నిజాలు అసలే అర్ధం కావు, అంతుచిక్కవు.. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏంటంటే ఎవరికి దొరకకుండా మాయం అవుతున్న మనుషుల గురించి.. ఇలా ఏటా ఎంతోమంది మహిళలు అదృశ్యం అవుతున్నారట. అసలు వాళ్ల జాడే తెలియడం లేదట. ఇలాంటి పరిస్దితులు స్త్రీల మనుగడకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయట.. ఇదే విషయంలో ప్రపంచ జనాభా 2020 పై ఐక్యరాజ్య సమితి జనాభా నిధి పేరిట నిన్న విడుదల చేసిన నివేదిక భారత్‌ను నివ్వెర పరుస్తోంది.

 

 

ఎందుకంటే దేశంలో గడిచిన గత 50 ఏళ్లలో ఏకంగా 4.58 కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఈ నివేదికలో ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్ల మంది గల్లంతు అయ్యారని వెల్లడించింది. ఇకపోతే ఈ మహిళల అదృశ్య సంఖ్య లెక్కలు 1970 లో 6 కోట్లు ఉండగా, తాజాగా అది ప్రస్తుతం రెట్టింపునకు పైనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా  చైనా, మహిళలు అత్యధికంగా అదృశ్యమవుతున్న దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉండగా, ఇక్కడ 7.23 కోట్ల మంది మహిళలు గల్లంతు అయ్యారట.  కాగా ఆ తర్వాతి స్థానాన్ని భారతదేశం భర్తి చేయగా భారత్‌లో ఏకంగా 2013-17 మధ్య కాలంలో 4.6 లక్షల మంది బాలికలు అదృశ్యమైనట్టు నివేదిక పేర్కొంది. ఇలా నగరాల్లోనే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయట..

 

 

ఇకపోతే పేదరిక నిర్మూలన విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరును ఐరాస ప్రశంసించింది.. అదీగాక వ్యవసాయ, సాంకేతిక వినియోగం, పెట్టుబడి తదితర రంగాల్లో తన అనుభవాన్ని ప్రపంచ దేశాలతో భారత్‌ పంచుకుంటోందని పేర్కొంది. ఇకపోతే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఈ ఐక్యరాజ్య సమితి. ప్రస్తుతం 193 దేశాలు ఇందులో పూర్తి కాలపు సభ్యదేశాలుగా ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: