క‌రోనా కేసుల తీవ్ర‌త‌తో.. తెలంగాణలో  మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తార‌నే చ‌ర్చ సాగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో మ‌ళ్లీ పూర్తిగా లాక్‌డౌన్ విధించేందుకు స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు కూడావార్త‌లు వ‌చ్చాయి.. ఈ త‌రుణంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  గత మూడు నెలల క్రితం లాక్ డౌన్ సమయంలో వంద కేసులు వస్తే బాబోయ్ కేసులు పెరుగుతున్నాయని భావించారు. కానీ ఇప్పుడు వెయ్యి వరకు కేసులు నమోదు అవుతున్నాయి.   మార్చి తర్వాత లాక్ డౌన్ పాటించిన సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాలేదు.. దాంతో కేసుల వ్యాప్తి తక్కువ అయ్యింది.

IHG

గత నెల నుంచి లాక్ డౌన్ సడలించడంతో కేసులు విపరీంగా పెరిగిపోవడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను జూలై 31వ తేదీ వరకు పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త లాక్ డౌన్ కు నూతన మార్గదర్శకాలను బుధ‌వారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొన‌సాగ‌నుండ‌గా..మెడికల్ ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునిచ్చింది. 

 

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు:


-  తెలంగాణలో రాత్రి 9.30 గంటల లోపల అన్ని షాపులు మూసేయాలి.


- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమ‌ల్లో క‌ర్ఫ్యూ.


- కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు.


-  లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: