దేశంలో కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు తినడానికి తిండి లేక చాల మంది నానా అవస్థలు పడ్డారు. అయితే వారికీ అండగా నిలిచేందుకు బ్యాంకులు కొన్ని స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే బ్యాంకులు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

 

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా..? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. జూలై 1 నుంచి ఏటీఎం క్యాస్ విత్‌డ్రా రూల్స్ మారబోతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట నేటి నుంచి ఇక అందుబాటులో ఉండదన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏటీఎం చార్జీలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనన్నారు. అయితే ఇప్పుడు ఆ బెనిఫిట్ ఉండదన్నారు.

 

 

ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటితే మళ్లీ చార్జీల బాదుడు ప్రారంభమౌతుందని తెలిపారు. అందువల్ల ఎస్‌బీఐ ఏటీఎం లేదా మరే ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు లిమిట్స్‌ను కూడా గుర్తుపెట్టుకోండి.

 

 

స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. మెట్రో నగరాల్లోని బ్యాంక్ కస్టమర్లు అక్కడ నెలలో 8 వరకు లావాదేవీలను ఉచితంగానే నిర్వహించొచ్చునన్నారు. అయితే ఏటీఎంలలో ఈ లిమిట్ దాటితే మాత్రం చార్జీలు పడతాయని తెలిపారు. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ కలిగిన వారికి ఇది వర్తిస్తుందన్నారు.

 

 

మెట్రో నగరాల్లోని ఎనిమిది ఉచిత ట్రాన్సాక్షన్లలో 5 ట్రాన్సాక్షన్లు ఎస్‌బీఐ ఏటీఎంలో నిర్వహించొచ్చునన్నారు. ఇక మిగతా 3 ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నిర్వహించొచ్చు. అదే నాన్ మెట్రో పట్టణాల్లో అయితే 10 వరకు ఏటీఎం లావాదేవీలు ఉచితం. ఐదు ట్రాన్సాక్షన్లను ఎస్‌బీఐ ఏటీఎంలో నిర్వహించొచ్చు. ఇక మిగతా ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసుకోవచ్చునన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: