దేశ వ్యాప్తంగా ఇప్పుడు కాస్త కరోనా మేనియా నడుస్తుంది. కరోనా దెబ్బకు ప్రజలు అందరూ కూడా అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడం, ఎక్కడి వరకు పరిస్థితి వెళ్తుంది అనేది అర్ధం కాక నానా రకాలు గా ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరోనా పరీక్షల విషయంలో మాత్రం కేంద్రం దూకుడుగా నిర్ణయం తీసుకోవడం లేదు. దూకుడుగా నిర్ణయం తీసుకుని పరిక్షలు పెంచాల్సిన అవసరం  ఉంది. 

 

క‌రోనా విష‌యంలో ప‌రీక్ష‌లు పెంచ‌డంతో పాటు దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉన్నా సరే కేంద్రం మాత్రం ఇంకా ఆలోచన ధోరణి తో వ్యవహరించడం ఇప్పుడు చికాకుగా మారింది అని చెప్పాలి. ఇది పక్కన పెడితే కరోనా పరిక్షల విషయంలో ఏపీ సర్కార్ మాత్రం దూకుడుగా వెళ్తుంది. ఏపీలో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్క‌డ ప‌రీక్ష‌లు ఏకంగా 9 ల‌క్ష‌లు దాటేశాయి. ఈ నేపధ్యంలో తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక ఇప్పుడు ఏపీ మీద ఆధారపడాలి అని భావిస్తున్నాయి అని అంటున్నారు. 

 

ఏపీలో కాస్త కేసులు తగ్గుముఖం పట్టగానే... పరిక్షల కోసం ఏపీని సంప్రదించాలి అని ఆయా రాష్ట్రాల సిఎం లు భావిస్తున్నారు. ఏపీ ఒక్క రోజే 30 వేల కరోనా పరిక్షలు చేసింది. కాని ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో చేయడం లేదు. క‌రోనా ప‌రీక్ష‌ల విషయంలో ఏపీ దేశానికే ఆద‌ర్శంగా మారింది. ఒక్క రోజు 30 ప‌రీక్ష‌లు చేసే స్థాయి నుంచి ఇప్పుడు రోజుకు 30 వేల ప‌రీక్ష‌ల స్థాయికి వెళ్లింది. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్రాలు ఏపీ మీద ఆధారపడే ఆలోచనలో ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: