దేశంలోకరోనా వైరస్ వచ్చినప్పటి నుండి దేవుడా ఈ కష్టాలు మన శత్రువులకు కూడా రావొద్దని అంటున్నారు. కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అనాధలను చేస్తోంది. చివరకు మరణించిన వారికి అందరూ ఉండి కూడా అనాధ శవంలా.. అతి దారుణంగా పూడ్చబడుతున్నారు. కరోనాతో మరణించిన వారి పరిస్థితి అలా ఉంటే.. ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల కూడా ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది.  కొన్ని ఆసుపత్రుల్లో దహనం చేసేందుకు అక్కడ ప్రభుత్వ పథకం అమలులో ఉన్నా కూడా వాటిపై అవగాహన కల్పించకపోవడంతో ఆ విషయం తెలియని వారు అనాధ శవాల్ల దహనం చేస్తున్నారు.  కొన్ని చోట్ల అంబులెన్స్ దొరకకపోవడంతో సైకిళ్లు.. రిక్షా బండ్లు, ఎడ్ల బండ్లపై తీసుకు వెళ్లిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

 

తాజాగా అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక ఓ గిరిజన మహిళ శవాన్ని నేరుగా నదిలో పడేశారు. మధ్యప్రదేశ్‌లో సిధీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  కాకపోతే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. దాంతో  ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ గిరిజన మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఎడ్లబండిలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో ఆ మహిళ కన్నుమూసింది.. అయితే శవాన్ని తరలించడానికి అంబులెన్స్ ఇవ్వాలని ఆమె బంధువులు వైద్య సిబ్బందిని కోరినా ఇవ్వలేదు.

 

చేసేదేమి లేక తిరిగి ఎడ్ల బండిపై తీసుకువస్తూ.. మధ్యలో సోన్ నదిలో విసిరేశారు.  తమ వద్ద డబ్బు లేదని.. అంత్యక్రియలు చేసే స్థాయిలో తాము లేమని కుటుంబ సభ్యులు వేరే మార్గం లేకపోవడంతో అందులో జార విడిచారు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వ పథకం అమలులో ఉంది. ఆ విషయం తెలియని వారు ఇలా చేయడంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: