అధికార పార్టీకి చెందిన నాయ‌కులు రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు.  భూముల విష‌యం నుంచి ఉద్యోగాల సిఫార‌సుల వ‌ర‌కు.. అధికారుల‌పై జులుం దాకా.. ఏదో ఒక వివాదంలో కూరుకుపోతున్నారు. ఇ ప్ప‌టికే ప‌లు జిల్లాల్లో నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు ఊపందుకున్నాయి. ఇక‌, ఇప్పుడు విశాఖ జిల్లా య‌ల‌మం చిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజుపైనా భూముల‌కు సంబంధించిన వివాదం ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై ఏకంగా క‌న్న‌బాబుపై కేసు కూడా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. యల‌మంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన రైతు పైలా వెంకటస్వామి కుటుంబానికి చెందిన 32 ఎకరాల్లో ఉద్యాన తోటలున్నాయి.

 

ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. అయితే,  కొంద‌రు వ్యక్తులు రైతు వెంకటస్వామి ఇంటి కి వచ్చి తాము ఎమ్మెల్యే కన్నబాబురాజు, పీఆర్‌ఎస్‌ నాయుడు మనుషులమని, తక్షణం పొలం ఖాళీ చే యాలని, లేకపోతే.. చంపేస్తామని బెదిరించారు. దీంతో రైతు కుటుంబం ఎస్పీని ఆశ్రయించింది. ఈ వివాదం జిల్లాను కుదిపేస్తోంది. 32 ఎకరాలకు సంబంధించి తమ కుటుంబం ఈ నెల 18న పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేస్తే వివాదంలో ఉందని చెప్పిన అచ్యుతాపురం తహసీల్దార్‌.. మూడు రోజుల వ్యవధిలోనే పీఆర్‌ఎస్‌ నాయుడితో మిలాఖత్‌ అయి మ్యుటేషన్‌కు యత్నించారని రైతు ఆరోపించ‌డం మ‌రో వివాదానికి కూడా దారితీసింది.

 

మొత్తంగా ఈ వివాదం చాలా దూరం ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఈ ప‌రిణామాల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కూడా ఫిర్యాదు అందింది. దీనిపై నేరుగా దృష్టి పెట్టాల‌ని కూడా జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప‌రువు పోయేలా .. ఓ వ‌ర్గం మీడియా ప‌ని గ‌ట్టుకుని రాస్తున్న రాత‌ల‌కు.. ఎమ్మెల్యేలు చేస్తున్న చేష్ఠ‌ల‌తో ప‌రువు పోతోంద‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. వీటికి త‌క్ష‌ణ‌మే అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి ఉత్త‌రాంధ్ర జిల్లాల ‌పార్టీ ఇంచార్జ్‌‌ విజ‌య‌సాయిరెడ్డి ని కూడా నివేదిక కోరిన‌ట్టు తెలుస్తోంది. కొస‌మెరుపు ఏంటంటే.. ఈ వివాదం త‌న‌కు తెలియ‌ద‌ని అంటూనే.. పొలం వివాదంలో వేలు పెట్టిన విష‌యం నిజ‌మేన‌ని అంటున్నారు క‌న్న‌బాబురాజు.. ఏదేమైనా.. ఈ వివాదం మ‌రింత ముద‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: