చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన ముఖ్యమైన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల డ్రాగన్ లు తీసిన దొంగ దెబ్బతో 21 మంది వీరమరణం పొందారు. దాంతో చైనా వస్తువులు అన్నా.. యాప్స్ అన్నా ఆగ్రహంతో ఊగిపోతున్నారు భారతీయులు.  కోట్లాది మంది భారతీయులు వినియోగించే టిక్‌టాక్‌ యాప్‌ కూడా ఆ జాబితాలో ఉండడంతో ఇకపై ఆ యాప్‌ను వినియోగించుకునే వీలు లేకుండా పోయింది.  మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న టిక్‌టాక్‌ స్టార్లకు  వీడియోల వల్ల నెలకు వేలాది రూపాయలు వచ్చేవి. ఢిల్లీలోని నిహారిక జైన్ (23) అనే అమ్మాయి ఈ యాప్‌ ద్వారా నెలకు రూ.30,000 వేల వరకు సంపాదించేది.‌ ఆమెకు యాడ్‌  వీడియోలు బాగా వచ్చేవి.

 

నిహారికకు అందులో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాంతో ఆమె తన సంపాదన కోల్పోయింది.. అయితే కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడాన్ని ఆమె సమర్థించింది. అయితే, తాను ఇకపై ఇతర ప్లాట్‌ఫాంను వెతుక్కోవాల్సి ఉందని చెప్పింది. ఇక తమ తరఫున వాదించాలంటూ మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ కోరింది. అయితే, ఆయన ఒప్పుకోలేదు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తెలిపి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుఫున ఆ పని చేయబోనని స్పష్టం చేశారు.

 

 గతంలోనూ ఓ సారి టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించగా ఆ సంస్థ కోర్టుకెళ్లింది. తిరిగి భారత్‌లో పలు నిబంధనలతో ఆ యాప్‌కు అనుమతులు ఇచ్చారు.  కానీ, ఈ సారి న్యాయవాదులు ఆ యాప్‌ తరఫున వాదించడానికి కూడా ముందుకు రావట్లేదు. దీంతో భారత్ లో టిక్ టాక్ ప్రస్థానం ముగిసినట్లేనని నెటిజన్లు భావిస్తున్నారు. తమ భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చేవాళ్లను ఎదిరించి పోరాడిన సైనికుల ఆత్మ క్షోబించే పనులు ఏ భారతీయుడు చేయబోరని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: