కంటికి క‌నిపించ‌ని క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు నానా ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. అన‌తి కాలంలోనే ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. ఇక ఇప్ప‌టికే క‌రోనా వైరస్ బాధితుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతూపోతోంది. కోటి దాటిన కేసులు ఇంకా.. ఇంకా పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. మ‌రియు ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు.

 

దీంతో ప్రజలు భయాందోళనలు మ‌రింత ఎక్కువ అవుతున్నాయి. ఇక ఈ ప్రాణాంత‌క వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం దేశ‌దేశాలకు పెద్ద స‌వాల్ మారింది. ఈ నేప‌థ్యంలోనే కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. రాత్రి, పగలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వాస్త‌వానికి డిసెంబర్‌లో అందరికి సరపడా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రిలీజైతే... అదే నెలలో ప్రపంచం మొత్తం కరోనాను వదిలించుకోవచ్చు. 

 

కానీ,  అది కుద‌ర‌ని ప‌ని. ఎందుకంటే.. ఎన్ని దేశాల్లో ఉత్పత్తి చేపట్టినా... పూర్తిగా అందరికీ కరోనా వ్యాక్సిన్ తయారవ్వాలంటే... 18 నెలలు పడుతుంద‌ట‌. అంటే... ఇప్పటి నుంచి మరో రెండేళ్ల పాటూ కరోనా సమస్య ఉంటుందన్నది తాజా స‌ర్వే పేర్కొంది. ఎందుకంటే.. ట్యాబ్లెట్లు అయితే రకరకాల పొడులు, పదార్థాల్ని కలపడం ద్వారా ఎన్ని కావాలంటే అన్ని రోజుల వ్యవధిలో తయారుచేయవచ్చు. కానీ వ్యాక్సిన్ అనేది అలా చెయ్యలేరు. దానంతట అది రోజురోజుకూ తయారవ్వాలి. అందుకోసం ల్యాబుల్లో వ్యాక్సిన్‌ను ప్రత్యేక వాతావరణంలో ఉత్పత్తి చెయ్యాలి. ఇందుకు చాలా కాల‌మే ప‌డుతుంది. మ‌రియు  అందరికీ చేరాలంటే కూడా ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. దీనిని బ‌ట్టీ చూస్తే.. ప్ర‌జ‌లు క‌రోనాతో మ‌రో రేండేళ్లు తిప్ప‌లు ప‌డాల్సిందే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: