వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఎంపీ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా సొంత పార్టీపై ఈ విధంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయంపై వైసిపి ఆరా తీస్తూనే ఉంది. బిజెపిలోకి వెళ్లడం ద్వారా, కేంద్ర అధికార పార్టీ అనే హోదా తో పాటు, 2024 ఎన్నికల్లో మళ్ళీ బిజెపి తరఫున నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికిప్పుడు ఉన్న పదవిని వదులుకుని బయటకు వెళ్లే అవసరం ఆయనకు ఏంటని ? ఆయన ఏదో కీలక పదవి మీద అసలు పెట్టుకునే ఇంత హడావుడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

 

IHG


ముఖ్యంగా ఏపీ బీజేపీ లో అధ్యక్ష పదవి ఖాళీగా, ఉండడంతో దానిపై ఆయన ఆశలు పెట్టుకున్నట్టుగా  అనుమానాలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పనితీరుపై ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలు  అసంతృప్తితో ఉన్నారు. దీంతో చాలా కాలంగా ఆ పదవిని కొత్త వారితో భర్తీ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పదవిని దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ,విశాఖకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్, వంటివారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.


 ప్రస్తుత పరిస్థితుల్లో కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ పెద్దలు అంతగా ఇష్టపడక పోవడంతో, క్షత్రియ సామాజిక వర్గం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో ఆయన పైరవీలు చేస్తున్నారనే అనుమానం ఇప్పుడు వైసిపి నాయకుల్లో మొదలైంది. అందుకే పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు ఎటువంటి అభ్యంతరం లేకుండా బిజెపిలో చేరవచ్చు అనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.


 ఈ విషయాన్ని ముందుగా గ్రహించ బట్టే, వైసీపీ ఆయనను సస్పెండ్ చేయకుండా, మరికొంతకాలం ఈ వ్యవహారాన్ని నాంచాలి అని, ఎట్టి పరిస్థితుల్లోనైనా రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయించాలనేది వైసీపీ ప్లాన్ గా ఉండగా, రఘురామకృష్ణంరాజు మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: