ఏపీలో రాజకీయ శూన్యత ఉందా. ఉంటే ఏ స్థాయిలో ఉంది అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. నిజానికి 151 సీట్లు వైసీపీకి జనం ఇచ్చారూ అంటే విపక్షం స్కోప్ బాగా తగ్గినట్లే కదా. ఇక కేవలం 23 సీట్లు అంటే జస్ట్ 15 పర్సెంట్ తో టీడీపీ, ఇతర పక్షాలు సీటింగ్ షేర్ తో ఉన్నాయి.  ఓటింగ్ షేర్ చూసుకున్నా తాజాగా జగన్  పార్టీకి  55 శాతం వచ్చినట్లుగా ఓ సర్వే నివేదిక చెబుతోంది.

 

అంటే ఏపీలో అధికారంలోకి రావడానికి ఇప్పట్లో వేరే పార్టీకి హోప్స్ కానీ, చాన్స్ కానీ లేదని తేల్చిన సర్వే అది, ఏతా వాతా విపక్ష టీడీపీతోనే మిగిలిన పార్టీలు పోటీ పడాలి. విపక్ష టీడీపీకి గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి, ఇపుడు 38 శాతానికి తగ్గినట్లుగా ఆ సర్వే చెబుతోంది. 

 

ఇవన్నీ చూసుకున్నపుడు ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ గా ఉన్న బీజేపీ, జనసేన అలియన్స్ కి టీడీపీకి మధ్యనే పెద్ద గ్యాప్ ఉంది. ఓట్ల తేడా కూడా భారీగా ఉంది. అయితే ఏపీలో 2024 నాటికి బీజేపీ, జనసేనా కూటమికి చాన్స్ వస్తుందని ఆయా పార్టీలు అంచనాలు వేసుకుని మురుస్తున్నాయి. సరే ఎవరి ఆనందం వారిదే అనుకున్నా ఇపుడు ఆ రెండు పార్టీల్లో కూడా ఉమ్మడి సీఎం ఎవరు అన్నది కూడా ఒక అభిప్రాయం లేదు.

 

పవన్ సీఎం అని జనసేన అంటూంటే బీజేపీ మాత్రం తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ని ఫోకస్ చేస్తోందని టాక్ మొదలైంది. ఈ మధ్య ఆమె వర్చువల్ సెమినార్ ద్వారా బీజేపీ క్యాడర్ తో మాట్లాడడాన్ని చూసి చెబుతున్నారో లేక ఆమెను నిజంగా ప్రొజెక్ట్ చేయాలని కమలం పార్టీ  అనుకుందో కానీ సోషల్ మీడియాలో ఒకటే గోలగా ఉందిపుడు

 

ఏపీ బీజేపీ సీఎం అభ్యర్ధి నిర్మల అంటున్నారుట. ఆమె కనుక సీఎం క్యాడిడేట్ అయితే బాగుంటుంది. దేశ రక్షణ మంత్రిగా పనిచేశారు ఆర్ధిక మంత్రిగా ఉన్నారు, పైగా ఏపీ నుంచి ఒకసారి రాజ్యసభకు వెళ్లారు, ఇక ఆమె తమిళనాడులో పుట్టినా తెలుగింటి  కోడలు గా ఉన్నారు. ఆమె భర్త పర‌కాల ప్రభాకర్ సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారని అంటున్నారు.

 

మొత్తానికి ఈ ఈక్వేషన్లతో కనుక బరిలోకి దిగితే మంచిచే కానీ, ఈ విషయం వైరల్ అవుతూండడంతో సోషల్ మీడియాలో జనసైనికులు రివర్స్ అవుతున్నారుట. ఎందుకంటే వారికి పవన్ సీఎం అని కదా నమ్మకం. ఆశ. మరి ఈ విషయం తేల్చడానికి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది. ఏది ఏమైనా ఆలూ చూలూ లేదు అన్నట్లుగా ఉంది ఈ కూటమి సీఎం అభ్యర్ధుల  ప్రచారం అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: