ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ బట్టి చూస్తుంటే కేంద్రం కంట్రోల్ చేయడానికి ఏలాంటి చర్యలు పెద్దగా చేపడుతున్నట్లు  పరిస్థితులు ఏమీ కనబడటం లేదు. అంతా మా చేతుల్లో లేదు దేవుడే కాపాడాలి అన్నట్టుగా కేంద్ర పెద్దలు మాటలు వింటున్నా వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎంత కఠినంగా అమలు చేస్తున్న అత్యధిక జనాభా గల దేశం కావటంతో రోజుకి దాదాపు 15 వేల నుంచి 20 వేల లోపు కొత్త కేసులు నమోదు కావడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. మొదటిలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో మోడీ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది అంటూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసల వర్షం కురిపించింది. కానీ నాలుగో దశ లాక్‌డౌన్‌ తర్వాత తీసుకున్న ఆంక్షల సడలింపులు చాలావరకు ఫ్రీగా ప్రజలను వదిలేసినట్లు ఉండటంతో భయంకరమైన పాజిటివ్ కేసులు బయటపడటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

 

పైగా ప్రజెంట్ వర్షాకాలం కావడంతో ఇంకా కేంద్రం కూడా మాస్కులు ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అన్న సూచనలు తప్ప కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ప్రత్యేకమైన నిర్ణయాలు లాంటివి ఏవి కూడా చేపట్టడానికి ముందుకు రానట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ రానున్న రోజుల్లో ఈ కరోనా అదుపుతప్పి భయంకరంగా వ్యాప్తి చెందే స్థాయిలో పరిస్థితి పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.

 

ముఖ్యంగా భారతదేశంలో అతి తక్కువ రోజుల్లోనే 15 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఇండియాకి హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కు ధరించకుండా ప్రభుత్వ సూచనలు పాటించకుండా ఉంటే ఇండియాలో పరిస్థితిని అదుపు చేయటం సాధ్యమయ్యే పని కాదని తెలిపింది. అయినా గాని కేంద్రంలో చర్యలు లేకపోవటంతో దాదాపు కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేతులెత్తేసినట్లే అని అంటున్నారు మేధావులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: