ఇండియాలో చాలా మంది సామాన్యులను టిక్ టాక్ యాప్ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు గా మార్చేసింది. సమాజానికి ఎంత వినోదం మంచిదో అంతే విధంగా ప్రమాదం కూడా తీసుకొచ్చింది టిక్ టాక్. అతి తక్కువ టైమ్ లోనే చిన్నపాటి వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ చేసి చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు. టిక్ టాక్ వీడియోల వల్ల ఆనందం ఎంతో కలిగించిందో అంతే స్థాయిలో సమాజంలో నేర ప్రవృత్తిని అదేవిధంగా అక్రమ సంబంధాలను… ప్రజలపై మరియు ఆడవాళ్ళ అత్యాచారాలపై రకరకాల గా మనిషి యొక్క ఆలోచనలు పూర్తిగా  భిన్నంగా స్పందించాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా మార్చేసింది అని చెప్పవచ్చు.

 

చాలా మంది భారతీయులు టిక్ టాక్ కి బాగా అలవాటు పడిపోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో చైనాతో కాయం అయ్యే పరిస్థితి నెలకొనడంతో ఆ దేశానికి చెందిన యాప్ లు  వాళ్ళ ప్రమాదం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది. నిషేధించిన 59 యాప్ లో టిక్ టాక్ కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. కాగా టిక్ టాక్ కి బాగా అలవాటు పడిన వారు కేంద్రానికి మొర్ర పెడుతూ దయచేసి… ఈ యాప్ ని మాత్రమే ఉంచండి...మేము బాగా అలవాటు పడిపోయాము, మిగతావన్ని నిషేధించండి అంటూ లాభో దిబో మంటూన్నారు.

 

కానీ దేశ భద్రత రక్షణ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం తప్పదని కేంద్ర ప్రభుత్వం కరెక్టుగా నిర్ణయం తీసుకుందని టిక్ టాక్ వ్యతిరేకులు నినదిస్తున్నారు. మన ప్రాణాలకంటే ఈ ప్రత్యర్థి యాప్ ముఖ్యం కాదంటున్నారు. మొత్తానికి టిక్ టాక్ కి అలవాటు పడిన వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాణాలు పోయే అంతగా ఫీల్ అవుతున్నారు. మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: