తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశాలు అన్నీ ఇన్నీ కావు. ఇది చాలా చిన్న వైరస్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తే సరిపోతుంది అంటూ చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా వైరస్ వ్యాప్తి చెంది ఉంది. ఇదే తరుణంలో కరోనా వైరస్ గురించి కేసీఆర్ మీడియా సమావేశాలు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు కూడా ప్రజెంట్ మానేయటం జరిగింది. గతంలో లాగా ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తూ మీడియా సమావేశాలు సీఎం కేసీఆర్ ఇప్పుడు నిర్వహించటం లేదు.

 

తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు రోజుకి ఊహించని విధంగా కొత్త కేసులు బయట పడుతున్న తరుణంలో కేసీఆర్ ప్రెస్ ముందుకు రావటం మానేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేంద్రంలో ఉన్న కొంతమంది అదేవిధంగా వైద్యనిపుణులు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే కమ్యూనిటీ స్థాయిలో కరోనా వ్యాప్తి చెంది ఉంది అని.. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర ని దాటుకొన్ని వెళ్ళిపోయే పరిస్థితి తెలంగాణలో ఉందని అంటున్నారు. ప్రభుత్వం ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేయలేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు చాలామంది చెప్పుకొస్తున్నారు.

 

ఇదిలా ఉండగా తెలంగాణ ఖజానా కి ఆయువు పట్టు అయిన హైదరాబాద్ నగరం త్వరలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ లోకి వెళ్లి పోయే పరిస్థితి ఉన్నట్లు స్వయంగా మంత్రులు తెలపటం జరిగింది. ఇదే సమయంలో పోలీసులకు మంత్రులకు కూడా కరోనా సోకే పరిస్థితి ఉండటంతో విపక్షాల నుండి ప్రజల నుండి డియర్ కేసీఆర్ మళ్లీ ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో వర్షాకాలం శీతాకాలంలో ఉంటె తెలంగాణలో మరణాలు కరోనా వైరస్ వల్ల కాదు కేసీఆర్ వైరస్ వల్ల చనిపోయిన పరిస్థితి ఉంటుందని విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: