చైనా భారత్ మధ్య అన్ని వ్యవహారాలు బెడిసికొట్టడంతో, ఇప్పుడు రెండు దేశాలు అన్ని కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారత్ టిక్ టాక్ తో సహా, 59 మొబైల్ యాప్స్ ను భారత్ నిషేదించింది. చైనా కూడా అదే రేంజ్ లో భారత్ మీడియా వెబ్సైట్లను బ్లాక్ చేసి, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు అని సవాల్ విసిరింది. ఒకరికొకరు అన్ని ఒప్పందాలను రద్దు చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చైనీస్ సోషల్ మీడియా దిగ్గజం విబో నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు విబో లో ఉన్న తన ఖాతా ను డి యక్టివేట్ చేసుకున్నారు. చైనా అప్స్ పై భారత ప్రభుత్వం నిషేధించిన వెంటనే, ఆయన విబో ఖాతా నుండి వైదొలిగినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

 

చైనా యాప్స్ పై నిషేధం విధించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అకౌంట్ ఢీ యాక్టివేట్ కాలేదు.ప్రైవసీ  పాలసీ దృష్ట్యా ఆ అకౌంట్ ను వివో తొలగించడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ  స్వయంగా విబో ఎకౌంటు ను డి యాక్టివేట్  చేసుకున్నారు. విబో లో ప్రధాని నరేంద్ర మోడీకి 2.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. విబోలో ఇప్పటి వరకు 115 పోస్టులు ప్రధాని చేయగా, ఇప్పటికే 113 పోస్టులను ప్రధానమంత్రి కార్యాలయం తొలగించింది. రెండు పోస్టులు మాత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోటోలు ఉండడంతో వాటిని తొలగించడం కష్టమైంది. విబోలో చైనా అధ్యక్షుడు ఫోటోలు ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం సాధ్యం కాదు. ఈ కారణం వల్లే ప్రధాని మోదీ వివో ఖాతాల్లో ఆ రెండు పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే చైనా యాప్స్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. చైనా యాప్స్ కారణంగా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు ఉందనే  ఫిర్యాదులు వస్తుండడంతో పాటు, భారత్ కు సంబంధించిన డేటాను విదేశీ సర్వర్లు ద్వారా అనధికారికంగా తరలించుకుపోతున్నారు అనే అనుమానాలు ఉండడం , సైనిక చర్యలు కారణంగా చైనా యాప్స్ ను భారత్ నిలిపివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: