పక్క చర్చల పేరుతో డ్రాగన్ కంట్రీ చైనా కాలయాపన చేస్తుంటే.... మరొక పక్క దేశ మిలిటరీ సరిహద్దుల్లో యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటూ మొహరిస్తోంది. దీనితో వారి కదలికలను పసిగట్టిన భారత్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. దాదాపు 20 వేల మంది చైనా సైనికులు భారత సరిహద్దుల్లో చేరుకోగా భారత కూడా అంతే వేగంగా స్పందించి సరిహద్దులకు మన శతఘ్ను లను మరియు యుద్ధ ట్యాంకులను తరలిస్తోంది.

 

విషయానికి వస్తే భారత వాయుసేన లో బాహుబలిలు లైన భారీ కాయలు రంగంలోకి దిగాయి. చైనా సరిహద్దుకు వ్యూహాత్మకంగా ఆయుధాలను బాహుబలులు చేర్చాయి. చైనా వారు తమ సరిహద్దుల్లోకి యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నారు అన్న విషయం భారర్త్ కు అందిన వెంటనే తమ దగ్గర ఉన్న పూర్తి బలంతో భారత్ సరిహద్దుల వద్ద దిగిపోయింది.

 

భారత వాయుసేన లోని బాహుబలులు అత్యధిక బరువు మోయ కలిగే విమానాలు మరియు హెలికార్లే. ఇవి భారతదేశం వద్ద భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా సైనికులను భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను కేవలం గంటల వ్యవధిలోనే తరలించవచ్చు. భారత అమ్ముల పొదిలో సీ17 గ్లోబ్ మాస్టర్ సీ130 సూపర్ హెర్క్యూలెస్ సీహెచ్47 షినూక్ ఎంఐ 17 హెలిక్యాప్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రంగంలోకి దిగి చైనా సరిహద్దుల్లోకి భారీ యుద్ధ ట్యాంకులు యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి.

 

ఇకపోతే అటువైపు నుండి చైనా వారు ఎప్పుడు కుట్రపూరితంగా దాడి చేస్తారా అని భారత్ ఆర్మీ కాచుకుని కూర్చుంది. వెంటనే తమ బాహుబలిని రంగంలోకి దింపి వారి దాడులను తిప్పి ట్టేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. అయితే చైనా వారు వ్యూహాత్మకంగా యుద్ధ సామాగ్రిని సరిహద్దుకి తరలిస్తున్నారా లేదా వారు భారత్ దృష్టిని మళ్లించి తద్వారా వారి దేశం పై ఆర్థికంగా భారత్ మరో దాడి చేయకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: