సరిహద్దుల్లో భారత్ ఆర్మీ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా కు ఇప్పటికే భారత్ ప్రభుత్వం వారి దేశానికి చెందిన 59 అప్లికేషన్స్ అనగా మొబైల్ యాప్స్ నిషేధించి నిన్ననే గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ దెబ్బ మరువకముందే వెంటనే చైనా దేశాన్ని కోలుకోనివ్వకుండా భారత మరో భారీ ఝలక్ ఇచ్చింది.

 

ఇప్పటికే చైనాతో డిజిటల్ వార్ మొదలు పెట్టిన భారత్ ఇప్పుడు వారికి మౌలికవసతుల రంగంలో కూడా చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. విషయం ఏమిటంటే భారత జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు ఇకపై అనుమతి లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

 

అంతేకాకుండా అన్ని ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు ఇచ్చిన డీల్స్ ను ఎక్కడికక్కడ సెటిల్ చేసే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాయింట్ వెంచర్లు సహా అన్ని హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతించబోమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇకపై భారత్ లోని చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో చైనా పెట్టుబడులకు చాన్స్ లేదని ఆయన ప్రకటించారు.

 

 

ఇక అంతేకాదండోయ్ చైనా కంపెనీల నిషేధానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారత కంపెనీలకే హైవే ప్రాజెక్టులో భాగస్వామ్యం ఇచ్చేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని మరియు ఒక నూతన విధానాన్ని రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేజారిపోగా చైనా వారి కంపెనీలకు భారీ నష్టం తప్పదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని రంగాల్లో చైనాకు గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: