తెలంగాణ హైకోర్టు మరొకసారి కెసిఆర్ ఆధ్వర్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యింది. గత వారాంతంలో చివరి రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులను అర్ధాంతరంగా ఆపివేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు ఇంకా ఎన్ని సార్లు హెచ్చరిస్తే సమర్థవంతంగా మీరు టెస్టులు నిర్వహిస్తారని సూటిగా ప్రశ్నించింది. కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్న ల్యాబ్స్ లో శాంపిల్స్ పెరిగిపోవడం మరియు ల్యాబ్ టెక్నీషియన్స్, సిబ్బంది తక్కువగా ఉండడంతో కొత్త శాంపిల్స్ తీసుకోవడం జరగలేదు.

 

అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కుప్పలుతెప్పలుగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక సిబ్బంది సరిపోనంత మరియు 24 గంటలు పని చేస్తున్నా మిగిలిపోయేంతలా శాంపిల్స్ ఏమన్నా తెలంగాణ వారు తీస్తున్నారా అంటే అదీ లేదు. హైకోర్టు దగ్గర నుండి వరుసగా తిట్లు తిన్న తర్వాత రోజుకి మహా అంటే మూడు నుంచి ఐదు వేల టెస్టులు మాత్రమే వారు జరుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపు రోజుకు 20 వేల టెస్టులు జరుగుతుండడం గమనార్హం. అయినా వారు ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా ఏ సాంకేతిక కారణం వల్ల కూడా టెస్టింగ్ ను ఆపలేదు.

 

ఇక్కడ పోల్చి చూడడం పాయింట్ కాదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రెస్ మీట్ లు పెట్టినప్పుడు విలేకరులు ఎందుకు అసలు టెస్టులు అధిక సంఖ్యలో తెలంగాణలో జరగడం లేదు అని అడిగితే. మాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు…. మాకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది అన్నట్లు మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు రోజుకు సుమారుగా 1000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నా టెస్టుల విషయంలో ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తెలంగాణ ప్రజలకు మింగుడు పడడం లేదు..

 

టెస్టులు లేకుండా అతి తక్కువ కేసులు నమోదు అయినప్పుడు ప్రజల ముందుకి వారానికి కనీసం ఒక్కసారైనా వచ్చి కనిపించిని కేసీఆర్ ఇప్పుడు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అంతేకాకుండా తన సొంత పార్టీలోని ఎమ్మెల్యేలే నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా అంటించుకొని వారితో పాటు ఇతరులకు కూడా రిస్క్ గా మారుతుంటే కెసిఆర్ ఎందుకు ఏమి చేయలేకపోతున్నాడు అన్నది రాష్ట్రంలోని ప్రజల ప్రశ్న. 

 

ఇకపోతే ఇప్పటికే హైకోర్టు మీకు చాలా సార్లు ఆదేశాలు జారీ చేశామని జూలై 17 వరకు చెప్పిన విధంగా టెస్టులు జరపకపోతే అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి కోర్టులో తమ ముందు హాజరు కావాల్సి ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరించారు. మరి ఇప్పుడైనా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని ఈ విషయంలో మరింత అప్రమత్తం చేస్తాడో లేదో వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: