భారతదేశ జవాన్ల పై గల్వాన్ లోయలో చైనా వారు జరిపిన కుట్రపూరిత దాడులకు సంబంధించి వారి తీరు మార్చుకోండి అని అవకాశం ఇచ్చినా చైనా వారు వారి దుర్బుద్ధి మార్చుకోనందున భారత్ వారిపై డిజిటల్ వార్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే 59 చైనీస్ యాప్స్ ను భారత దేశంలో పని చేయకుండా చేశారు. ఈ నిషేధంతో ఇప్పటికే చైనా స్టాక్ మార్కెట్ పై భారీ ప్రభావం పడగా తాజాగా భారత్ తో ఇదే సరైన సమయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా చేతులు కలిపాడు.

 

ట్రంప్ ఒక్కసారిగా చైనాపై అగ్గిమీద గుగ్గిలం అయ్యడు. కోపంతో ఊగిపోయాడు. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య భారీగా పెరగడం పై ఆ దేశ వైద్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నియంత్రణ తమ చేతుల్లో లేదని వారు చేతులు ఎత్తేసిన సమయంలో ట్రప్ కోపంతో రగిలిపోయారు. తమ దేశంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ కకలావికలం చేసింది అని కోపంతో ఊగిపోతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇకపోతే ఇప్పటికే భారత చైనా వారి యాప్స్ ను బ్యాన్ చేయడమే కాకుండా హైవే ప్రాజెక్టులలో కూడా వారి కాంట్రాక్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల కూడా వారికి వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ఒక్కొక్క రంగాల్లో వారికి సంబంధించిన అన్ని మౌలిక వసతులను కట్ చేసి భారతీయులకు ఇవ్వబోతున్నామని ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం నుండి కూడా సమాచారం వచ్చేసింది. ఇటువంటి సమయంలో అమెరికా కూడా భారత్ తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ దీనివల్ల భారత్ మరింత పురోగతి సాధిస్తుందని అభినందించడం గమనార్హం.

 

 

కరోనా విషయంలో ఏనాడు చైనా దేశాన్ని తప్పు పట్టని భారత ప్రభుత్వమే ఇంత చేస్తుంటే అమెరికా భారత్ ను చూసి చైనా వారిని గట్టిగా దెబ్బ కొట్టేందుకు సిద్ధమైపోయింది. ఒక ముఖ్యంగా వారితో ఉన్న ఒప్పందాలను అన్నింటిని రద్దు చేసుకునేందుకు మరియు చైనా కి సంబంధించిన కంపెనీలు మరియు ఇండస్ట్రీల పై ఉక్కుపాదం మోపేందుకువారి పెట్టుబడులను వెనక్కి ఇచ్చేంసుకు రెడీ అయిపోయాడట ట్రంప్. అంతేకాకుండా వారు ఏ రంగాలలో భాగమై ఉన్నారో వాటన్నిటినీ రద్దు చేసే విధంగా కూడా అమెరికా ప్రధాని సన్నద్ధం అయ్యాడని సమాచారం. ఇక భారత్-అమెరికా కలిస్తే చైనా పరిస్థితి ఎలా ఉండబోతోందో ఊహించుకోవడానికి ఆ దేశ ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: