ఏడాది కాలంలో వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది పనితీరు బాగుంది? అంటే చాలామంది పనితీరు పెద్దగా బాగోలేదనే ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వస్తుంది. ఏదో జగన్ ఇమేజ్‌తో గెలవడం, ఇప్పటికీ ఆయన ఇమేజ్ మీదే ఆధారపడి ఉండటం, ఇంకా నియోజకవర్గంలో సరైన పనితీరు కనబర్చకపోవడం, ప్రజలకు పెద్దగా అందుబాటులో లేకపోవడం, పైగా కొన్ని అక్రమాలకు పాల్పడటం వల్ల కొందరి వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి.

 

అలా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా నెగిటివ్ ఉందని జిల్లా ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. కేవలం ఆయన పార్టీ కార్యకర్తలకే పనులు చేయడం, మిగతావారిని పట్టించుకోపోవడం వల్ల, నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకిత పెరిగిందని తెలుస్తోంది. పైగా ద్వారంపూడి అనుచరులు దందాలు చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. 

 

అసలు టోటల్‌గా చూసుకుంటే ఎమ్మెల్యేగా, ఆయన పనితీరు పట్ల కాకినాడ సిటీ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. అయితే ఇదే కాకుండా ద్వారంపూడి ఆ మధ్య చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దారుణంగా వారిని బూతులు తిట్టారు. ఇక అప్పుడే జనసేన కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్ళి హడావిడి చేస్తే, వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో జనసేన కార్యకర్తలు ఇప్పటికీ ద్వారంపూడిపై కోపంగానే ఉన్నారని తెలుస్తోంది. అటు టీడీపీ వాళ్ళు కూడా ఆయన పై గుర్రుగానే ఉన్నారు.

 

ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎలాగైనా ద్వారంపూడికి చెక్ పెట్టాలని రెండు పార్టీల వారు చూస్తున్నారు. మొన్న ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ద్వారంపూడి గెలిచేవారు కాదని, కానీ ఈ సారి మాత్రం అలా జరగకూడదని, ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఎలాగైనా టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తాయని, అందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదని ఆ రెండు పార్టీల కార్యకర్తలు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్వారంపూడికి చెక్ పెట్టేయోచ్చని తెలుగు తమ్ముళ్ళు, జనసైనికులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: