భారత్-చైనా సరిహద్దు ల మధ్య గాల్వాన్ లోయలో  జరిగిన ఘర్షణలో  భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులైనా  నేపథ్యంలో... చైనా తీరుకు నిరసనగా చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఎంతో గుర్తింపు పొందిన టిక్ టాక్ యాప్ తో పాటు మరో 59 చైనా కు సంబంధించిన యాప్ లను  భారతదేశంలో నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది, ప్రస్తుతం భారతదేశంలో ఇప్పటికే డౌన్లోడ్ అయిన యాప్ లు  పనిచేయకుండా పోవడం తో పాటు ప్లే స్టోర్ యాప్ అందుబాటులో ఉండటంలేదు, 

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యాప్  నిషేధంపై భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతుంది అని చెప్పాలి. చైనా కు సంబంధించిన మిగతా యాప్స్  పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ టిక్  టాక్  అనే యాప్ కి మాత్రం భారత ప్రజానీకం ఎంతోమంది ఎడిక్ట్  అయిపోయారు అన్న విషయం విషయం తెలిసిందే. దాదాపు రోజుల తరబడి టిక్ టాక్లో  సమయం గడుపుతూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. 

 


 సరైన అవకాశాలు లేక ఎంతో మంది నటులు తెర మీదికి కనిపించకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే . అయితే ఇలాంటి వాళ్ళందరికీ మానసికంగా ఎంతో సంతృప్తి  ఇచ్చినటువంటి టిక్ టాక్. ప్రస్తుతం ఈ యాప్ కి  30 కోట్ల మంది వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒకసారి నిషేధించడంతో టిక్ టాక్ సబ్స్క్రైబర్లు అందర్నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ప్రస్తుతం టిక్ టాక్ నిషేధంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్లి పోతున్నారు  అంటూ అందరినీ రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు పలు మీడియా సంస్థలు.

మరింత సమాచారం తెలుసుకోండి: