గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ దేశాల్లో  చైనా దేశపు తీరు ఎంతో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇతర దేశాలకు చెందిన భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం.. కాదంటే ఘర్షణకు దిగడం లాంటి ఘటనలు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చైనా పై మరింత నెగిటిటివీటిని పెంచుతున్నాయి. అయితే చైనా తమ దేశం విషయానికి వచ్చేసరికి చేసేవన్నీ తప్పులు... కానీ బయట దేశం విషయంలో మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంది. ముఖ్యంగా భారత దేశానికి చెందిన యాప్స్ కానీ మీడియా సంస్థలను కానీ చైనాలోకి రానివ్వకుండా పూర్తిగా బ్లాక్ చేసింది చైనా. 


 అదే సమయంలో ఇతర దేశాల్లో మాత్రం చైనా యాప్స్ ఉండాలంటూ డిమాండ్ చేస్తుంది చైనా. ఇటీవల చైనా కు సంబంధించిన టిక్ టాక్ సహా మరో 59 యాప్స్ ని  కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లే స్టోర్ నుంచి భారత్లో ఈ యాప్ ను తొలగించారు, అయితే దీనిని తీవ్రంగా తప్పు పడుతుంది చైనా. తమ దేశ యాప్ లను  తొలగిస్తే మీకు ఇబ్బందులు తప్పవు అంటూ  చెబుతోంది. 

 

 అయితే ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చైనా కు సంబంధించిన అన్ని యాప్లను నిషేధించడంతో ఏకంగా 5 లక్షల డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు  స్పష్టమైంది. ఇలా ఆ దేశానికి యాప్ల నిషేధం కారణంగా భారీగా నష్టం వస్తుండడంతో... చైనా యాప్లను ప్రపంచీకరణ దృష్టిలో చూడాలని వీటిని నిషేధించడం ద్వారా మీకు ఇబ్బందులు తప్పవు అంటూ చైనా శ్రీరంగ నీతులు చెబుతుంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చైనా ఎన్ని ప్లాన్లు వేసినప్పటికీ మళ్లీ భారత్లో చైనా కు సంబంధించిన యాప్స్ తిరిగి ఉపయోగంలోకి తెచ్చే అవకాశం మాత్రం లేదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: