ఇప్పుడు కాపు రిజర్వేషన్ అనే ఒక తేనెతుట్టె ఏపీలో రేగింది. గత టీడీపీ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ అంశం పై పెద్ద రాద్ధాంతం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామంటూ  తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో కాపుల్లో ఆశలు చిగురించాయి. అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, తమ కల నెరవేరుతుందని అంతా భావించారు. కానీ ఆ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వాయిదా వేసుకుంటూ రావడం, వంటి పరిణామాలతో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని లేవదీశారు. ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు టిడిపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. ఇక 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేను అంటూ మొహమాటం లేకుండా చెప్పేసారు.

 

IHG

 

దీంతో వైసీపీ పని అయిపోయిందని, కాపులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు అని, ఇక మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని అంచనా వేయగా, అనూహ్యంగా వైసిపికి ఊహించని విధంగా మెజారిటీ సీట్లు లభించాయి. దీంతో ఆ అంశం పక్కన పడిపోయింది అనుకుంటూ ఉండగా, కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసి అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేయడంతో ఇప్పటి వరకు తమకు ఓటు బ్యాంకుగా నిలుస్తారు అనుకుంటున్న జగన్ వైపు తిరిగిపోతున్నారనే అభిప్రాయంతో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు మొదలుపెట్టారు.

 

దీనికి కౌంటర్ గా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పవన్ పై విమర్శలు చేయడంతో, ఈ వ్యవహారం మరింత ముదిరింది. మీకు చంద్రబాబే ప్రపంచ శాంతి దూతగా కనిపిస్తారని, జగన్ అంటే మీకు పడదు కాబట్టి, ఆయన ఏం చేసినా మెచ్చుకోరని, ఇప్పుడే మీకు కాపులు గుర్తుకు వచ్చారా ? ముద్రగడ ను పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని కన్నబాబు తీవ్రంగా విమర్శించడంతో పవన్ గట్టిగా తిరిగి

 

విమర్శించే లేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇప్పుడు కాకపోయినా, ఆ తర్వాత అయినా పవన్ కాపుల అంశంపై వైసీపీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తారని, కాబట్టి పవన్ కు కాపు ఓటు దూరం చేసే విధంగా జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తే.. పవన్ కు చెక్ పెట్టినట్లు అవుతుందని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలో ఆయన రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన కన్నబాబు కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా పవన్ కు చెక్ పెట్టాలనే వ్యూహంతో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: