వైరస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వం స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తుందని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకు రావటానికి కరోనా ముసుగులో మోడీ ప్రకటనలు ఉన్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో చావకూడదు అని దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో కేవలం రేషన్ ఇస్తే సరిపోతుందా..? ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇస్తే కూడా బాగుంటుంది అనే డిమాండ్ వినబడుతోంది. మరోపక్క మోడీ కేవలం ఫ్రీగా రేషన్ ఇవ్వడం బీజేపీ మరియు దాని అనుబంధ సంస్థలు చాలా గొప్పగా దేశవ్యాప్తంగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇదంతా కేవలం స్వార్ధపూరిత రాజకీయాలు కోసమే కొన్ని రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి కష్ట కాలంలో సంక్షోభంలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి ప్రత్యేకంగా మోడీ మళ్ళీ వచ్చి ప్రకటించటం చూస్తుంటే వైరస్ ని అడ్డంపెట్టుకుని బీజేపీ పొలిటికల్ గేమ్స్   ఆడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మోడీ చేసిన ప్రకటన 24 గంటలు గడవకముందేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వచ్చే ఏడాది జూన్ మాసం వరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉచిత రేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది.

 

దీంతో నవంబరు వరకు ఫ్రీ రేషన్ అని ప్రకటించిన మోడీ భక్తులకు… మమతా బెనర్జీ ప్రకటన అదిరిపోయే కౌంటర్ ఇచ్చినట్టు అయింది. ఇదే తరహాలో మమతాబెనర్జీ మాదిరిగా ఆయా రాజకీయ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తే బీజేపీ భక్తుల అత్యుత్సాహాని మోడీ చేసిన ప్రకటనలు కి డప్పు కొట్టే భక్తులకు చెక్ పెట్టినట్లు  అవుతుందని కొందరు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: