ఇండియాలో కరోనా వైరస్ కేసులు భయంకరంగా బయట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రోజుకి దాదాపు 20 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గాని వైద్యులు గాని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చాలా వరకు కేంద్రం చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే కరోనా ని కట్టడి చేయడంలో చేతులెత్తేసినట్లే అన్నట్టుగా ఉన్నాయి. మరోపక్క వ్యాక్సిన్లు గానీ సరైన మెడిసిన్ గాని ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవటంతో ఇండియాలో నమోదవుతున్న కరోనా కేసులు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో భయంకరంగా కరోనా వ్యాప్తి చెందుతోంది.

 

ఇలాంటి నేపథ్యంలో కేంద్రం మరియు ఉద్దవ్ థాకరే సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా వైరస్ అదుపులోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇండియా లో వైరస్ ఎంటరైన నాటి నుండి మహారాష్ట్రలో కేసులు బయటపడుతూనే ఉంటూ మహారాష్ట్ర దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని జులై నెల ఆఖరి వరకు లాక్ డౌన్ విధించినట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటన చేయడం అందరికీ తెలిసిందే.

 

పరిస్థితి ఇలా ఉండగా దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై ఈ రాష్ట్రంలోనే ఉండటంతో కరోనా పాజిటివ్ కేసులు కూడా ఈ నగరంలో అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో ముంబై మహానగరంలో సెక్షన్ 144 ను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూలై 15 వ తేదీ వరకు మహారాష్ట్రలో 144 సెక్షన్ అమలు కానుంది. కరోనాను అరికట్టాలి అంటే సమూహాలను అడ్డుకోవాలని, అప్పుడే కరోనాకు అడ్డుకట్ట వేయగలుగుతామని ముంబై డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ముంబాయి నగరంలో వినాయక చవితి వేడుకలు కూడా జరగవని అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: