సాధారణంగా మనం కుక్కలు మొరగడం, పిల్లులు మ్యావ్ అని అనడం.. పక్షులు కూత పెట్టడం మనం చూశాం. మరి నక్కలు ఏం చేస్తాయి? అవి ఎం చేస్తాయో ఎప్పుడైనా చూశారా? అవి కూడా ఊల పెడుతాయట. అయితే అవి రాత్రిపూటా మాత్రమే ఎక్కువగా ఊల పెడుతాయట. అయితే ఊల మాత్రమే కాదట అవి మాట్లాడుతాయట. 

 

అయితే అవి ఎం మాట్లాడుతాయి అనేది ఒక్క నక్కలకు తప్ప మనుషులకు ఏమాత్రం అర్ధం కావు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ''నక్కలు ఏదో మాట్లాడుతున్నాయి.. ఎం మాట్లాడుతున్నాయి చెప్పండి'' అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ అయ్యింది. 

 

వీడియోను చుసిన ప్రతిఒక్కరికి అవి ఎం మాట్లాడుతున్నాయో అర్ధం అవ్వక అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే నక్కలు మాట్లాడటం కంటే కూడా నవ్వుతున్నట్టే కనిపిస్తుంది. అయితే ఈ వీడియో మార్చిలో యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యగా ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 18 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.  

 

ఇందులో క‌నిపించే మూడు న‌క్క‌లు ఫిన్నెగ‌న్‌, డిక్సీ, విక్సీ. ఇంకా వీటికి చ‌క్కిలిగింత‌లు పెట్టె కొద్దీ తెగ న‌వ్వుతున్నాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఏవేవో శ‌బ్ధాలు చేస్తూ న‌వ్వుతూ తుళ్లుతూ కింద‌ప‌డి దొర్లుతున్నాయి. అందుకే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి మీరు కూడా ఈ వీడియోను ఓసారి చూసేయండి. అవి ఏం మాట్లాడుతున్నాయో అర్ధం అవుతే కామెంట్ చేసి మాకు తెలపండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: