దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 59.43 శాతంగా ఉండగా మరణాల రేటు 2.97 శాతంగా ఉంది. తెలంగాణలో 44.64 శాతం మంది కోలుకోగా ఏపీలో 44.61 శాతం మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 15 వరకు ముంబైలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్న ఢిల్లీలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. గతంతో పోలిస్తే అక్కడ ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అన్ లాక్ 2.0 సడలింపులు అమలులోకి రావడంతో కేసుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు ప్రజలు కరోనా భారీన పడకుండా ఉండాలంటే స్వీయ లాక్ డౌన్ ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించినా తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు నిబంధనలు సరిగ్గా పాటించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచనలు చేస్తున్నారు. 
 
ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని.... శానిటైజర్లను వాడాలని..... జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రమే వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దేశంలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని.... స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మినహా కరోనా సోకకుండా రక్షించుకోవడానికి మరో మార్గం లేదని వారి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.           
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: