కరోనా వైరస్ ప్రజలపై విరుచుకు పడుతున్న వేళ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ చిన్న జబ్బు వచ్చిన రోగి పరిస్దితి దారుణంగా మరింది.. ఎందుకంటే కరోనా భయంతో అసలు డాక్టర్స్ రోగులను దగ్గరికి కూడా రానివ్వడం లేదు.. ఇక ప్రైవేట్ అస్పత్రి వారైతే కనీసం గేటు లోపలికి కూడా రానివ్వకుండా మరో ఆస్పత్రికి వెళ్లండంటూ పంపించి వేస్తున్నారు. అక్కడి నుంచి ఇంకో ఆస్పత్రికి వెళితే అక్కడ కూడా అదే సమాధానం. ఇలా తప్పక వైద్యం అందవలసిన వారికి ఇదొక నరకంగా తయారు అయ్యింది.. ఇక డబ్బులకు ఆశపడి కొందరిని అడ్మిట్‌ చేసుకుంటున్నా వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు.. అక్కడ ఉన్న సదపాయాలేమిటి అనేవి చెప్పడం లేదు. కొందరు డాక్టర్లు అయితే రోగులపట్ల మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు..

 

 

అయితే ఆపదలో ఆస్పత్రికి వచ్చిన రోగిని తిప్పి పంపించడం సరికాదని, రోగులకు కొన్ని హక్కులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి చోట హక్కుల గురించి తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొంటున్నారు. రోగులకు ఉన్న హక్కుల చార్టర్‌లో ఈ హక్కులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరించింది. అవేమంటే తమ ఆస్పత్రికి వచ్చిన రోగులకు సమాచార హక్కు చట్టం కింద ఏ విషయం దాచకుండా అందించాలి.. ఒకవేళ రోగి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వెంట వచ్చిన సహాయకుడికి ఆ వివరాలు తెలియచేయాలి..

 

 

ఇక రోగి వైద్యానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన సమాచారం కూడా లఖిత పూర్వకంగా అందించాలి. ఇకపోతే రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ, లేదా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సంరక్షణ పొందే హక్కు ఉంది. కాబట్టి వారికి వెద్యాన్ని తిరస్కరించకూడదు.. అదీగాక వ్యాధి నిర్ధారణ కేసు పరిశీలన పత్రాలను అడ్మిషన్‌ జరిగిన 24 గంటలు, లేదా డిశ్చార్జి అయిన 72 గంటల్లోగా అందించాలి. రోగి మరణిస్తే దానికి సంబంధించిన నివేదికలును అసలు కాపీలతో రోగి సంరక్షకులకు లేదా బంధువులకు ఇవ్వాలి.రోగి మృతదేహాన్ని అప్పగించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మృతదేహాన్ని పొందే హక్కు సంరక్షకులకు ఉంటుంది. ఇక ఒక వ్యక్తి చికిత్స నిమిత్తం హస్పిటల్‌కు వస్తే ఆ రోగి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చుల వివరాలను నోటిసు బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలి.

 

 

అంతే కాకుండా రోగి చికిత్స ప్రణాళిక గురించిన సమాచారాన్ని తప్పని సరిగ్గా వైద్యులు గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అదీగాక మహిళా రోగులకు తమకు మహిళ నిపుణుల ద్వారానే వైద్యం ఇప్పించాలని ఆశించే హక్కు ఉంది. రోగుల గౌరవాన్ని నిలబబెట్టడానికి ఆస్పత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 

 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒక ఆరోగ్య కేంద్రం నుంచి మరొక ఆరోగ్య కేంద్రానికి రోగిని తప్పనిసరిగా బదిలీ చేస్తే, వారికి, సంరక్షకులకు కొత్త ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి సంబంధించిన వివరాలు పూర్తిగా  వివరించాల్సి ఉంటుంది. బదిలీ తర్వాత కొనసాగించాల్సిన చికిత్సలు, మందుల జాబితాను కూడా వారికి ఇవ్వాలి. రోగి లేదా వారి సంరక్షకుడు అంగీకరిచకపోతే ఈ చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ రోగి ఇంటికి వెళతానంటే బలవంతంగా నిర్బంధించ కూడదు.. విన్నారా ఒక పేషెంట్ వైద్యం పొందే ముందు తనకు ఎన్ని హక్కులున్నాయో.. ఇవి తెలుసుకోకుండా ఎంత బిల్లు వేస్తే అంత చెల్లించి అమాయకుల్లా ఇంటికి వెళ్లుతాము..

మరింత సమాచారం తెలుసుకోండి: