లోకంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా ప్రతివారి బాధ్యతను గుర్తుచేస్తుంది.. జాగ్రత్తగా మెలగాలని హెచ్చరిస్తుంది.. ఇప్పటికే పరిస్దితులు చేయి జారిపోయినా ప్రభుత్వాలు మాత్రం కుంటి సాకులు చెబుతూ కరోనా విషయంలో ప్రజలను మోసం చేస్తున్నాయనే అపవాదులను మూటగట్టుకుంటున్నాయి. అసలు కరోనా విషయంలో ప్రభుత్వాలకే సృష్టత లేదని కొందరు వాదిస్తున్నారట కూడా.. దీనికంతటికి కారణం ప్రభుత్వాలు అవలంభించిన, అమలు పరుస్తున్న నియమాలు..

 

 

లాక్‌డౌన్ పేరిట సాధించింది ఏమైనా ఉందా అంటే వారు చెప్పేది ఏంటో తెలుసా సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాము అని జబ్బలు చరుచుకుంటుంది.. కానీ లాక్‌డౌన్ సడలించాక పరిస్దితి పూర్తిగా మారిపోయింది.. సరైన దిశలేని నిర్ణయాల వల్ల ఎదుర్కొనే ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు మనదేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను చూస్తే అర్ధం అవుతుంది.. ఇక ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పధకాలు ఎంతమంది పేదలకు చేరుతున్నాయో వారికి అవసరం లేదు.. కరోనా పేరు చెప్పుకుని వచ్చిన డబ్బులకు కొందరు ఎలుకల్లా కన్నాలు వేస్తున్నారు.. అసలు ప్రజలను పట్టించుకోని పాలన ఇప్పుడు జరుగుతుందనే భావన ప్రతి వారిలో కలుగుతుందట..

 

 

ఒక రకంగా దేశంలోని పరిస్దితులు అస్తవ్యస్తంగా మారిన ప్రజల దృష్టిలో మాత్రం ప్రభుత్వాలు తాము కరోనాను ప్రాణాలు అడ్డువేసి ఆపుతున్నామన్నంతగా బిల్డప్ ఇస్తున్నాయట.. ఇక ఇప్పటికే కరోనా ప్రతి వార్డ్‌కు వ్యాపించింది.. ప్రతి గడపలో కాలు పెట్టడానికి దీనికి ఎక్కువ సమయం పట్టదు.. ఇలాంటి క్లిష్టపరిస్దితుల్లో ప్రజలు ఆకలితో చావడమా, కరోనాతో మరణించడమా అనే ఆలోచనతో భయపడుతూ బ్రతుకుతున్నారు.. ఇంతటి పరిస్దితుల్లో కూడా మద్యం విషయంలో ఏ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు.. ఇక చండీఘడ్ లో అయితే ఏకంగా వివాహ వేడుకల్లో మద్యం సరఫరాకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. చండీఘడ్ కేంద్ర పాలిత ప్రాంతంలో వివాహ వేడుకల్లో ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యాన్ని సరఫరా చేయవచ్చని కేంద్ర సలహాదారు మనోజ్ పరీడా చెప్పారట. అయితే బార్‌లను మాత్రం మూసి ఉంచాలని ఆదేశించారు.

 

 

ఇకపోతే అన్ లాక్ 2 నిబంధనల ప్రకారం లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. ఇందులో భాగంగా చండీఘడ్ కేంద్రపాలిత ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు, కారులో నలుగురు, ఆటోల్లో ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాహనాలను ప్రతీరోజూ శానిటైజ్ చేయడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. కానీ ఇలా చేయడం వల్ల కరోనా ఆగకపోవడమే కాదు మరింతగా వ్యాపిస్తుందన్న విషయాన్ని మరచిపోతున్నారని కొందరు అంటున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: